టీమిండియాలో విధ్వంసకర బ్యాట్స్ మెన్ అంటే గుర్తుకు వచ్చేది మొదటగా వీరేంద్ర సెహ్వాగ్. ప్రస్తుత ఈయన ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈయన తర్వాత ఈ స్థానాన్ని రోహిత్ శర్మ పూర్తి చేశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా వీరేంద్ర సెహ్వాగ్ లాగా టీమిండియాలో ఓపెనర్ గా వచ్చి ప్రత్యర్థి బౌలర్లను ఉతికి ఆరేస్తాడు. ఇక అసలు విషయానికి వస్తే....

 

 


మన డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ బ్యాటింగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని ఇంగ్లాండ్ క్రికెట్ టీం బ్యాట్స్ మెన్ కం వికెట్ కీపర్ అయిన జోస్ బట్లర్ తెలిపాడు. ఈ మధ్య ఇంగ్లాండ్ క్రికెట్ టీం నిర్వహించిన ఇంస్టాగ్రామ్ లైవ్ లో జోస్ బట్లర్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు.. అంతేకాక కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశాడు. రోహిత్ శర్మ గొప్ప బ్యాట్స్ మెన్ అని తను బ్యాటింగ్ కొద్దిసేపు చేసినా దాని ప్రభావం భారత్ పై చాలా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

 


బట్లర్ ఇంకా చెబుతూ ఈ విషయం ఇప్పుడు చెప్పకూడదు కానీ చెబుతున్నా అని చెప్పి... కొన్ని సంవత్సరాల క్రితం భారత బ్యాట్స్ మెన్ కి షార్ట్ పిచ్ బంతులు వేసి ఆడటానికి వీలులేకుండా చేసేవారని తెలిపాడు. అయితే ఆ తర్వాత వారిని రోహిత్ శర్మ ఉతికి ఆరేయడం మొదలు పెట్టాడు. దీనితో ప్రత్యర్థులు వ్యూహం మార్చి ఫుల్లర్ బంతుల్ని వేయడం ప్రారంభించారు. అయితే వాటిని కూడా రోహిత్ శర్మ ఎటువంటి జంకూ లేకుండా బాల్ ని బౌండరీ అవతలికి పంపుతున్నాడు. అందుకే నాకు రోహిత్ శర్మ బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: