అతి చిన్న వయసులో టీమిండియా క్రికెట్ కు సెలెక్ట్ అయినా వారిలో పార్థివ్ పటేల్ కూడా ఒకడు తాను టీమిండియా కు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ గాను, ఫుల్ టైం కీపర్ గా అయ్యన పని చేసాడు. అతి చిన్న వయసు లోనే టీమ్ ఇండియా తరఫున 25 వన్డేలు, 38 టెస్ట్ లు ఆడిన భారత్ క్రికెటర్ పార్థివ్ పటేల్. ఇటీవల ఆయన తన చేతికి 9 వేళ్ళు మాత్రమే ఉన్నాయని తెలియజేశారు. అప్పట్లో పార్థివ్ పటేల్ వికెట్ కీపర్ గా బాగా రాణించారు. అసలు ఆ ఒక్క వేలు ఎలా పోయింది అని ఆయన తెలియజేశారు. తన చిన్న వయసులో తలుపు సందులో పడి చిటికెన వేలు విరిగి పోయిందని పార్థివ్ పటేల్ తెలియజేశారు. తన ఆరు సంవత్సరాల వయసులో ఈ సంఘటన చోటు చేసుకుంది అని తెలిపారు. 

 


ఒక పెద్దయిన తర్వాత క్రికెట్ కెరీర్ ను ఎంచుకున్న తర్వాత మొదటిలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనడం జరిగింది. ముఖ్యంగా గ్లైజ్‌లో పది వేళ్ల అమరిక ఉన్న సమయంలో కాస్త ఇబ్బందిగా  కాస్త ఇబ్బందిగా అనిపించింది అని తెలిపారు. ఇక ఆ తర్వాత అలవాటుగా మారిపోయింది అని తెలిపారు. అంతేకాకుండా 9 వేళ్ళతోనే టీమిండియాకు ఆడటం చాలా ఆనందకరమైన విషయం అంటూ పార్థివ్ పటేల్ తెలియచేశారు. 

 


ఇక 2018 - 19 లో ఆస్ట్రేలియా వేదికగా చారిత్రక టెస్ట్ సిరీస్ లో విజయం సాధించిన జట్టులో పార్థివ్ పటేల్ కూడా ఆడారు. అలాగే న్యూజిలాండ్ కు చెందిన ఒక ఆటగాడు మార్టిన్ గప్టిల్  కూడా ఒక కాలుకు కేవలం రెండు వేలు మాత్రమే ఉన్నాయి. ఒక ప్రమాదంలో ఆయన కాలికి మూడు వేళ్ళు తెగిపోవడం జరిగింది. ఏది ఏమైనా పార్థివ్ పటేల్ తన కెరియర్ ను ఐపీల్ లో కూడా తన సత్తా చాటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: