గత కొంతకాలం నుంచి అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్ ఓపెనర్లు మహమ్మద్ రిజ్వాన్ బాబర్ అజాం లు అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతూ భారీ భాగస్వామ్యాలు నెలకొల్పుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎవరితో మ్యాచ్ జరిగినా కూడా ఓపెనింగ్ జోడినే భారీగా పరుగులు చేస్తూ జట్టుకు విజయాన్ని అందిస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక ప్రతి మ్యాచ్ లో కూడా ఇద్దరు ఓపెనర్లు హాఫ్ సెంచరీలు చేయడం లేదా సెంచరీలతో అదరగొట్టడం లాంటివి చేస్తూ ఉన్నారు. అయితే గత కొంతకాలం నుంచి మహమ్మద్ రిజ్వాన్  పరుగులు చేస్తూ ఉన్నప్పటికీ మరో ఓపెనర్ పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్  మాత్రం అసలు మాత్రం పరుగులు చేయలేక పోతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనె బాబర్ పేలవమైన ఫామ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన రెండవ టి20 మ్యాచ్లో మాత్రం బాబర్ అజాం మునుపటి ఫామ్ లోకి వచ్చి అదిరిపోయే ప్రదర్శించేశాడు అన్న విషయం తెలిసిందే. సూపర్ సెంచరీ తో చెలరేగిపోయాడు. ఇక తద్వారా పాకిస్తాన్ ఓపెనింగ్ జోడినే భారీ టార్గెట్ ఛేదించి  జట్టును గెలిపించింది. ఒక వికెట్ కూడా కోల్పోకుండానే అది వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ పై  పాకిస్తాన్ విజయం సాధించింది.


 ఈ క్రమంలోని పాకిస్తాన్ ఓపెనర్లు మహమ్మద్ రిజ్వాన్, బాబర్ అజాం  టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించారు అని చెప్పాలి. ఇంగ్లాండ్ పై రెండు వందల మూడు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  అయితే ఇప్పటివరకు అంతర్జాతీయ టి20 లలో  ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం గమనార్హం.  ఇక ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా పై 197 పరుగులు చేదించి ఇదే జోడి అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పిన జోడిగా రెండవ స్థానంలో కొనసాగుతూ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: