భారత స్టార్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ బ్యాటింగ్ విధ్వంసానికి బ్రేకులు వేసే బౌలర్ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో కనిపించడం లేదు అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం భారత జట్టు ఏ జట్టుతో మ్యాచ్ ఆడిన కూడా వరుసగా సూర్య కుమార్ యాదవ్ మాత్రం భారీగా పరుగులు చేస్తూనే ఉన్నాడు. స్టార్ బౌలర్లు అతనికి బౌలింగ్ చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా బంతి ఎక్కడ వేసిన బౌండరీకి తరలించడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నాడు అని చెప్పాలి. వెరసి అతని బ్యాటింగ్ విధ్వంసమే ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.


 ఇక ప్రపంచ క్రికెట్లో రానున్న భవిష్యత్తులో అతను ఒక లెజెండరీ క్రికెటర్ గా ఎదగడం ఖాయమని అందరి రికార్డులను తిరగరాస్తాడు అంటూ ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా సూర్య కుమార్ యాదవ్ ప్రతిభ పై స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. అంతేకాదు సూర్య కుమార్ యాదవ్ మ్యాచ్ ఆడుతున్నాడు అంటే చాలు అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తప్పకుండా దక్కుతుందని ఇంకొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే ఇటీవల సౌత్ ఆఫ్రికా తో జరిగిన రెండవ టి20 మ్యాచ్ లో మరోసారి మెరుపు ఇన్నింగ్స్  తో ఆకట్టుకున్న సూర్య రికార్డు సాధించాడు. అంతర్జాతీయ టి20 లో ప్రపంచ రికార్డును బ్రేక్ చేశాడు అని చెప్పాలి.  21 బంతుల్లో 61 పరుగులు చేశాడు సూర్య కుమార్ యాదవ్.  ఈ క్రమంలోనే అతి తక్కువ బంతుల్లో అంతర్జాతీయ టి20  లలో 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా ప్రపంచ రికార్డును సృష్టించాడు. 573 బంతుల్లోనే ఈ ఫీట్ సాధించాడు సూర్య కుమార్ యాదవ్. అంతకుముందు 604 బంతుల్లో 1000 పరుగులు సాధించిన రికార్డు అటు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ మాక్స్వెల్ పేరిట ఉండేది. ఇప్పుడు సూర్య కుమార్ యాదవ్ ఈ అరుదైన రికార్డును బ్రేక్ చేసి తన పేరును లికించుకున్నాడు  అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: