సాధారణంగా ఐసిసి విడుదల చేసే ర్యాంకింగ్స్ లో టాప్ టెన్ లో చోటు సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతూ ఉంటారు అని చెప్పాలి . ఈ క్రమంలోనే ఎప్పుడు మంచి ప్రదర్శన చేస్తూ ఐసీసీ ర్యాంకింగ్స్ లో తమ స్థానాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వివిధ ఫార్మాట్లకు సంబంధించి ర్యాంకులు విడుదల చేసిన కూడా అది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఇకపోతే ఇటీవలే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ని విడుదల చేసింది.


 ఇక ఇటీవలే ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొమ్మిదవ ర్యాంకును దక్కించుకోవడం గమనార్హం. 697 పాయింట్స్ లతో ఇలా తొమ్మిదవ స్థానంలో కొనసాగుతూ ఉన్నాడు. ఇక రోహిత్ శర్మకు ఇదే బెస్ట్ ర్యాంక్ కావడం గమనార్ధం. అయితే రోహిత్ శర్మ తర్వాత విరాట్ కోహ్లీ 691 పాయింట్లతో పదవ ర్యాంకులో కొనసాగుతూ ఉన్నాడు. పాకిస్తాన్ కెప్టెన్ స్టార్ బ్యాట్స్మెన్ బాబర్ అజాం 890 పాయింట్లతో నెంబర్ వన్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఆ తర్వాత ఇమామ్ అప్ హక్,  డసన్,  ఢీకాక్, వార్నర్ కొనసాగుతూ ఉన్నారు.


 ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే గత కొంతకాలం రోహిత్ శర్మ ఎక్కడ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు అని చెప్పాలి. ఫార్మాట్ ఏదైనా సరే రోహిత్ శర్మ పెద్దగా తన బ్యాటింగ్తో ఆకట్టుకోలేకపోతున్నాడు. అంతేకాకుండా ఇక కెప్టెన్ గా మారిన తర్వాత కేవలం టి20 ఫార్మాట్ కి మాత్రమే పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటున్న రోహిత్ శర్మ వన్డే, టెస్ట్ ఫార్మాట్ కి మాత్రం ఎక్కువగా అందుబాటులో ఉండడం లేదు అన్న విషయం తెలిసిందే. అలాంటి రోహిత్ శర్మ ఏకంగా తొమ్మిదవ స్థానాన్ని దక్కించుకోవడంతో కొంతమంది అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: