
గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ సాయి సుదర్శన్ (25 ఇన్నింగ్స్‌లు) మాత్రమే అతని కంటే ముందున్నాడు. అయితే పాటిదార్.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ రుతురాజ్ గైక్వాడ్ (ఇద్దరూ 31 ఇన్నింగ్స్‌లు) వంటి వారిని కూడా వెనక్కి నెట్టేశాడు. ముంబై ఇండియన్స్ యువ కెరటం తిలక్ వర్మ (33 ఇన్నింగ్స్‌లు) ఈ జాబితాలో తర్వాతి స్థానంలో ఉన్నాడు.
అయితే, పాటిదార్ సాధించింది కేవలం వేగవంతమైన 1000 పరుగులు మాత్రమే కాదు. ఐపీఎల్ చరిత్రలో మరెవరికీ సాధ్యం కాని ఒక యూనిక్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అదేంటంటే.. ఐపీఎల్‌లో 1000 పరుగులు పూర్తి చేసిన వారిలో, 35కు పైగా యావరేజ్‌తో పాటు, 150కి పైగా స్ట్రైక్ రేట్ కలిగిన తొలి భారత బ్యాటర్‌గా రజత్ పాటిదార్ నిలిచాడు. ఇది అతని నిలకడైన ఆటతీరుకు, ఒత్తిడిలోనూ అదరగొట్టే సత్తాకు నిదర్శనం.
మ్యాచ్ విషయానికొస్తే.. శుక్రవారం వర్షం అంతరాయం కలిగించడంతో ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు నిరాశ ఎదురైంది. పంజాబ్ జట్టు 5 వికెట్ల తేడాతో ఆర్సీబీపై విజయం సాధించింది.
వర్షం కారణంగా మ్యాచ్‌ను చెరో 14 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. అయితే, చివర్లో టిమ్ డేవిడ్ (26 బంతుల్లో 50 పరుగులు) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ఆర్సీబీ 14 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేయగలిగింది.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 12.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. నేహాల్ వధేరా (19 బంతుల్లో 33) వేగంగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ (3/14) అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టినా, అది జట్టు ఓటమిని ఆపలేకపోయింది.
అంతకుముందు, ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా అర్ష్‌దీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్, మార్కో జాన్‌సెన్ తమ అద్భుత బౌలింగ్‌తో ఆర్సీబీ బ్యాటర్లను కట్టడి చేసి, వరుసగా వికెట్లు తీసి దెబ్బకొట్టారు.