ఏదైనా మారుమూల ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడ రవాణా సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పడుతుంటాం. ఓ సైకిలైనా ఉంటే బావుండనుకుంటాం. కానీ కొండ ప్రాంతాల్లోకి వెళ్లినప్పుడు సైకిళ్లు కూడా తొక్కేందుకు అనుకూలంగా ఉండవు. మరి స్కూటర్ వంటివి తీసుకెళ్లాలంటే.. అదో తలనొప్పి.

 

మారుమూల ప్రాంతాలే కాదు..నగరాల్లోనూ దగ్గరి ప్రాంతాలకు వెళ్లాలంటే.. ఓ స్కూటర్ ఉంటే బావుంటుంది. మరి సింపుల్ గా మడత పెట్టేసుకుని తీసుకెళ్లే స్కూటర్ ఉంటే.. ఎంత బావుంటుంది. ఇప్పుడు ఇదే ఐడియాతో మడత పెట్టే స్కూటర్లు తయారయ్యాయి.

 

సన్ టెక్ యూకే ప్రైవేటు లిమిటెట్ వీటిని తయారు చేస్తోంది. ఈ స్కూటర్లను ఈ ఫోల్డి స్కూటర్ అంటారు. ఈ స్కూటర్లు చార్జింగ్ ద్వారా పని చేస్తాయి. ఒకసారి చార్జింగ్ చేస్తే 25 కిలోమీటర్ల వరకూ అలవోకగా వెళ్తాయి. దీని బరువు కూడా సింపుల్ గా 17 కేజీలు మాత్రమే. కారు డిక్కీలో పెట్టుకుని తీసుకెళ్లొచ్చు. ఇదేదో బావుంది కదూ. మరి మీరూ ట్రై చేస్తారా..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: