సాంకేతికత పెరిగిన నేటి ఆధునిక యుగంలో స్మార్ట్‌ఫోన్‌ లేనిదే చాలామందికి రోజులు గడవని పరిస్థితి నెలకొంది. బిచ్చ‌గాడి ద‌గ్గ‌ర‌నుంచి కోటీశ్వ‌రుల వ‌ర‌కు నిత్యం స్మార్ట్ ఫోన్‌నె ఉప‌యేగిస్తుంటారు. ఈ క్ర‌మంలోనే ఉదయం లేచినప్పటి నుంచి అర్ధరాత్రి పడుకునే వరకు ఫోన్ పక్కన ఉండాల్సిందే.  అవసరాలకు మొబైల్‌ చాలా అవసరం. సమాచారమైనా, చేస్తున్న ఉద్యోగం, వ్యాపారం, ఏ పనైనా కావచ్చు. ఇక ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. స‌హజంగా ఏదో పనిలో నిమగ్నమై యదాలాపంగా చేతిలోని ఫోన్‌ను ఇంట్లో ఏదో మూలన పెట్టేస్తాం. 

 

ఆ తరువాత ఫోన్‌తో అవసరమొచ్చి దాన్ని వెతికిపట్టుకునేందుకు నానా తంటాలు పడుతుంటాం. దారిద్రం ఏంటంటే.. అప్పుడే ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉండ‌డం. అప్ప‌డు వెత‌క‌డం మ‌రింత క‌ష్టం అవుతంది. అలాంట‌ప్పుడు ఓ సింపుల్‌ ట్రిక్ ద్వారా మీ ఫోన్‌ ఎక్క‌డ ఉందో తెలుసుకోవ‌చ్చు. సైలెంట్ మోడ్‌లోకి ఉన్న ఫోన్ ప‌ట్టుకోవాలంటే.. ఖచ్చితంగా ఆ డివైస్ డేటా కనెక్షన్ లేదా హోమ్ వై-ఫై నెట్‌వర్క్ కనెక్టెయి ఉండాలి. మ‌రియు గూగుల్ ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ఇంట్లో పోగొట్టుకున్న ఆండ్రాయిడ్ ఫోన్‌ను వెతికి పట్టుకునే క్రమంలో మీ కంప్యూటర్‌ను ఆన్ చేసి ఏదో ఒక వెబ్‌బ్రౌజర్‌లోకి వెళ్లండి. 

 

బ్రౌజర్‌లోకి వెళ్లిన తరువాత ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ పేజీలోకి వెళ్లిండి. త‌ర్వాత మీ జీమెయిల్ అకౌంట్ వివరాలతో లాగిన్ అవ్వండి. మీ అకౌంట్‌తో కనెక్ట్ అయి ఉన్న డివైస్ లు జాబితా మీకు కనిపిస్తుంది. వాటిలో పోగొట్టుకున్న మీ డివైస్‌ను సెలక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు రింగ్, లాక్, ఎరేజ్‌ ఆప్షన్‌లు కనిపిస్తాయి. వాటిలో రింగ్‌ బటన్ పై క్లిక్ చేసి క‌న్ఫ‌ర్మేష‌న్ బాక్స్‌ను కన్ఫర్మ్ చేసుకోండి. కొద్ది నిమిషాలు తరువాత మీ ఫోన్ కు రింగ్ చేసినట్లయితే సైలెంట్ మోడ్ తొలగిపోయి పూర్తి వాల్యుమ్‌తో రింగ్ టోన్ మీకు వినిపిస్తుంది. దీంతో మీ ఫోన్ ఎక్క‌డ ఉందో తెలుస్తుంది.
 
 
 
  

 
 
 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: