
ఈ ఆప్షన్ ను ఎంచుకుంటే యాప్‌లో కొంత సమయం గడిపిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్ నుండి 10, 20 లేదా 30 నిమిషాల విరామం తీసుకోవడానికి అవకాశం లభిస్తుంది. మోస్సేరి ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ఈ విషయాన్ని వెల్లడించారు. డిసెంబర్‌లో టేక్ ఎ బ్రేక్ అందరికీ అందుబాటు లోకి వచ్చే అవకాశం ఉందని ఆడమ్ మోస్సేరి చెప్పారు.
ఇన్‌స్టాగ్రామ్ టీనేజ్ వినియోగదారులకు హానికరం అనే విమర్శల మధ్య కొత్త ఫీచర్ వచ్చింది. ఇటీవల అమెరికన్ విజిల్ బ్లోయర్ ఫ్రాన్సిస్ హౌఘన్ ప్రముఖ సోషల్ మీడియా యాప్‌లు యుక్త వయస్కుల మానసిక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని వెల్లడించారు. ఫేస్ బుక్ గ్లోబల్ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ నిక్ క్లెగ్ మాట్లాడుతూ ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్ చెడు కంటెంట్ ను తొలగించడానికి కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతుందని చెప్పారు. యుక్త వయస్కులు ఒకే కంటెంట్‌ను పదే పదే చూస్తున్నట్లు మా సిస్టమ్‌లు చూసినట్లయితే మేము వారిని ఇతర కంటెంట్‌ను చూడమని ప్రోత్సహిస్తాము అని ఆయన అన్నారు.
ప్లాట్ ఫామ్‌లో భద్రతా ఫీచర్‌లు, చట్టపరమైన హక్కులు, రక్షణల గురించి అవగాహన కల్పించడానికి ఇన్‌స్టాగ్రామ్ ఇటీవల కొత్త ప్రచారాలను మొదలెట్టింది. ఈ ప్రచారాలలో దేశవ్యాప్తంగా యువతకు సహాయం చేయడానికి వివిధ భాషల్లోని కంటెంట్‌లో కనిపించే విభిన్న సృష్టికర్తలు కూడా ఉంటారు.