ప్రస్తుతం దేశంలో వున్న ప్రతి ఒకరికి కూడా అవసరమైన పత్రం ఆధార్ కార్డ్.ప్రతి భారతీయుడికి ముఖ్యమైన పత్రాలలో ఖచ్చితంగా ఈ ఆధార్‌ కార్డు ఉంటుంది అనే చెప్పాలి. దేశంలో ముఖ్యమైన గుర్తింపు పత్రాలలో ఇదొకటి. ఇది లేనిది అసలు ఏ పనులు జరగవు.ఆధార్‌ కార్డ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల మార్గదర్శకాలను జారీ చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా యూఐడీఐ (UIDI) అనేది కొత్త సర్వీసును కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే ఆధార్‌ ఫేస్‌ అథంటికేషన్‌ ఆర్‌డీ పేరుతో కొత్త యాప్‌ను కూడా ఆవిష్కరించింది. దీని సాయంతో ఆధార్‌ కార్డుదారులు ఎక్కడి నుంచైనా కూడా ఫేస్‌ అథంటికేషన్‌ (Aadhaar Face Authentication)ను ఈజీగా పూర్తి చేసుకోవచ్చు. అంతే ఇక మీ మొబైల్‌లో యాప్‌ ఉంటే చాలు ఫోన్‌ ద్వారా మీ ఫేస్‌ స్కానింగ్‌తో అథంటికేషన్‌ ని ఈజీగా పూర్తి చేసుకునే సదుపాయం ఉంటుంది. యూఐడీఏఐ తీసుకున్న నిర్ణయంతో చాలా మందికి కూడా ప్రయోజనం చేకూరనుంది. ఇందు కోసం యూఐడీఏఐ ఆర్‌డీ (Aadhaar Face Rd) యాప్‌ను మీరు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.


ఈ ఆధార్‌ యాప్‌ సర్వీస్‌ను జీవన్‌ ప్రమాణ్‌, పీడీఎస్‌, స్కాలర్‌షిప్‌ స్కీమ్‌లు, కోవిడ్‌ ఇంకా అలాగే ఫార్మర్‌ వెల్ఫేర్‌ పథకాలు వంటి వాటికి ఉపయోగించుకోవచ్చని యూఐఈఏఐ ఓ పోస్ట్ లో తెలిపింది. ఆధార్‌ ఉన్నవాళ్లు వారి ఆధార్‌ నెంబర్‌లు, ఇతర డెమొగ్రాఫిక్‌ ఇంకా అలాగే బయోమెట్రిక్‌ డేటాను ఫేస్‌ అథంటికేసన్‌ కోసం సెంట్రల్‌ ఐడెంటిటీ డేటా రెపోజిటరీలో కూడా పొందుపర్చుకోవచ్చు. ఇంకా అలాగే ఆధార్ ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని యుఐడిఎఐ ఇన్‌హౌస్‌లో అభివృద్ధి చేసిందని ఇంకా Aadhaar FaceRD యాప్ ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని ఉపయోగించి ఆధార్ ప్రామాణీకరణ కోసం వ్యక్తి ముఖాన్ని క్యాప్చర్ చేస్తుందని uidai తన పోస్ట్ ద్వారా తెలిపింది. మీ మొబైల్‌లో google Play Store యాప్‌ను మీరు సందర్శించి Aadhaar FaceRD అనే యాప్‌ను మీరు డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: