సాధారణంగా గుళ్లకు వెళ్లి భగవంతుడికి పూజ చేసి స్మరిస్తూ ఉంటాను. ఇక పూజలు అనేది భగవంతుడిని కోరికలు కోరుతూ పూజలు చేస్తూ ఉంటాను. కానీ ఈ దేశం కోసం పోరాడిన నాయకుల కోసం ఎప్పుడైనా పూజ చేయడం మనం చూశామా..? కానీ ఆ ఊరి గ్రామస్తులు మాత్రం ,ఆ ఊరిలో ఏ చిన్న కార్యక్రమం మొదలు పెట్టినా సరే ,ముందుగా గాంధీజీకి పూజ చేసిన తర్వాతనే మిగతా పని ప్రారంభిస్తారట. అంతేకాదు మహాత్మాగాంధీని అక్కడ గ్రామస్తులు ఒక దేవుడిలా కొలవడం గమనార్హం..

ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే, వర్షాలు కురవక పోయినా.. పంటలు పండక పోయిన మహాత్మా గాంధీజీ ని వారు పూజిస్తారు అట.. ఉదాహరణకు ఆఊరిలో వర్షాలు పడలేదు అని అనుకుందాం.. ఆ ఊరి గ్రామస్తులు ఏం చేస్తారంటే.. గాంధీజీ విగ్రహానికి జలాభిషేకం చేస్తూ ..నిత్యం స్మరిస్తూ దేవుళ్లతో సమానంగా ఆ గ్రామస్తులు పూజిస్తూ వస్తున్నారు.. మహాత్మా గాంధీకి చేసే సేవలు వారికి ఫలితాన్ని ఇస్తున్నాయట. ఇంతకూ ఆ  గ్రామం ఎక్కడ ఉంది.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలోని డిచ్ పల్లి మండలం లో ఉన్న నర్సింగపూర్. ఈ గ్రామంలో సుమారుగా 13 వందల మంది జనాభా ఉన్నారు.. అంతేకాదు ఈ ఊరి గ్రామస్తులు జాతిపిత మహాత్మా గాంధీని గౌరవించడంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నర్సింగపూర్ గ్రామం మధ్యలో 1961 వ సంవత్సరం నవంబరు ఒకటవ తేదీన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆ వూరి ప్రజలు ప్రతిష్టించారు.. ఆ రోజు నుంచి మహాత్మాగాంధీని ఒక దేవుడిలా పూజిస్తూ, నిత్య పూజలు చేస్తున్నారు.. ఇకపోతే ఆ ఊర్లో ఉండే దేవాలయాల్లో నిత్యం పూజలు జరుగుతాయి లేదో తెలియదు కానీ ,మహాత్మాగాంధీకి మాత్రం తప్పకుండా నిత్య పూజలు జరుగుతాయట.

గాంధీజీ  జయంతి ,వర్ధంతి లను మాత్రమే గుర్తుపెట్టుకునే మన  దేశ ప్రజలకు .. ఆ ఊరి ప్రజలు ఆదర్శంగా నిలుస్తున్నారు.. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా సరే గాంధీజీ కి పూజలు చేసిన తర్వాతనే ప్రారంభిస్తాం అంటూ నర్సింగపూర్ వాసులు తెలియజేస్తున్నారు.. నాటి తరాల నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని తాము కూడా పాటిస్తున్నామని ఆ గ్రామ వాసులు తెలపడం గమనార్హం.



మరింత సమాచారం తెలుసుకోండి: