పని వేళల్లో పంచాయితీ ఉద్యోగులంతా కలిసి పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. కొవిడ్ నిబంధనలు గాలికి వదిలి ఓ మామిడి తోటలో మందు, విందుతో ఫుల్ ఎంజాయ్ చేశారు. మహిళా ఉద్యోగులు కూడా  ఈ దావత్ లో పాల్గొన్నారు. అయితే ఈ వీడియో కాస్త బాగా వైరల్ అయింది. దీంతో  కలెక్టర్ స్పందించి.. సదరు అధికారులపై చర్యలు తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రం లోని ఒక  మామిడి తోటలో  22 మండలాలకు చెందిన పంచాయితీ ఉద్యోగులు శుక్రవారం దావత్ ఏర్పాటు చేసుకున్నారు. తలా కొన్ని డబ్బులు వేసుకుని పెద్ద ఎత్తున పార్టీ చేశారు. పని వేళను పక్కన పెట్టి, కొవిడ్ నిబందలను తుంగలో తొక్కి చుక్క, ముక్క తో ఎంజాయ్ చేశారు. మహిళా ఉద్యోగులు సైతం పార్టీలో పాల్గొన్నారు. కాగా ఈ మామిడి తోటలో జరుగుతున్న పార్టీ విషయం మీడియాకి తెలిసింది. దీంతో ఘటన స్థలానికి మీడియా వారు వెళ్ళారు. వారిని చూసినా ఆ ఉద్యోగులంతా పరుగులు తీశారు. కాగా ఈ దావత్ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. టెలీవిజన్ల లోనూ ప్రసారమయ్యింది. పని వేళల్లో పార్టీలు ఏంటని పెద్ద ఎత్తున వారిపై విమర్శలు వచ్చాయి. ఇట్లాంటి పాండమిక్ పరిస్థితుల్లో నిబంధనలు గాలికి వదిలి పార్టీలు చేయడం సరికాదని చాలా మంది వారిపై మండిపడ్డారు. ఆదర్శంగా వుండాల్సిన అధికారులే ఇలా చేయడం సరికాదని పెద్ద ఎత్తున కామెంట్లు వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో కాస్త బాగా హల్చల్ చేయడంతో సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి గారు స్పందించారు. వెంటనే ఎంపిడిఓ ను ట్రాన్స్ఫర్ చేయడంతో పాటు ఎంపీ ఓ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొవిడ్ పాండమిక్ పరిస్థితుల్లో.. పని పక్కన పెట్టీ పార్టీలు చేయడం ఏంటని అధికారులపై మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: