ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు పాటించాలని అటు పోలీసులు ఎంత మొత్తుకున్నా వాహనదారులు మాత్రం పెడచెవిన పెడుతున్నారు అని చెప్పాలి.  ఇక రోడ్డు నిబంధనలు పాటించకపోవడం కారణంగా కొన్నిసార్లు వారి ప్రాణాలను ప్రమాదంలో పడేసుకుంటూ ఉన్నారు. ఇంకొన్నిసార్లు వాళ్లు క్షేమంగానే ఉన్నప్పటికీ వాళ్ళు చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా అభం శుభం తెలియని వేరొకరు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. ఇలా ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కానీ ఎక్కడ తగ్గడం లేదు అని చెప్పాలి.


 ఇక రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాల్లో విషాదం నిండి పోతూ ఉంది అని చెప్పాలి. అయితే మనం సరిగ్గా వెళ్లినప్పటికీ ఇతరులు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం కారణంగా చివరికి రోడ్డు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. అన్నదానికి నిదర్శనంగా ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ గా మారిపోయాయి. ఇక ఇప్పుడు మరో వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారి అందరిని అవ్వక్కయ్యలా చేస్తుంది. బెంగళూరు తూర్పు డివిజన్ ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కళా కృష్ణస్వామి ట్విట్టర్ వేదికగా ఈ వీడియోని పంచుకున్నారు. ఒకసారి ఈ వీడియోలో చూసుకుంటే రోడ్డుపై ఒక కారు ఆగి ఉంటుంది. ఇక వాహనాలు అటూ ఇటూ వెళ్తూ రోడ్డు మొత్తం ఎంతో రద్దీగా ఉంది. ఇలాంటి సమయంలోనే ఇక ఒకవైపు నుంచి లారీ వెళ్తుంటే మరోవైపు నుంచి బైక్ పైన ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు. ఇక అంతలో ఊహించని ఘటన. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారులో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా కార్ డోర్ తెరిచాడు.  దీంతో కార్ డోర్ బైక్ పై వస్తున్న వ్యక్తులను తాకింది. వెంటనే వారు పక్క నుంచి వెళ్తున్న లారీని ఢీ కొట్టారు. దీంతో ఒక్కసారిగా రోడ్డుపై అచేతన స్థితిలో పడిపోయారు. అయితే ఈ ప్రమాదం ఎప్పుడో జరిగింది అయినప్పటికీ ఇలాంటి తప్పులు మాత్రం చేయకండి అంటూ కళా కృష్ణస్వామి ఈ వీడియోని అందరితో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: