సాధార‌ణంగా పెళ్లైన ప్ర‌తి స్త్రీ.. తాను గ‌ర్భ‌వ‌తి అని తెలిసిన‌ప్పుడు ప‌డే ఆనందం మాట‌ల్లో చెప్ప‌లేనిది. స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న టైమ్‌.. అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. అవి మొద‌టిసారి గ‌ర్భం పొందిన మ‌హిళ‌ల‌కు కాస్త విచిత్రంగా అనిపించినా.. కంగారు పాడాల్సిన అవ‌స‌రం లేదు. ఇక మహిళలు గర్భసమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పోషకాహారం తీసుకుంటుండాలి. ఈ టైమ్‌లో ఎంతగా కేర్ తీసుకుంటే పుట్టబోయే బిడ్డకు, తన ఆరోగ్యానికి అంత మేలు జరుగుతుంది. పండ్లు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి.

 

ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. సాధార‌ణంగా సాధారణంగా ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఎక్కువగా కలలు వస్తుంటాయి. ఆ సమయంలో వచ్చే కలలు కూడా విచిత్రంగా ఉంటాయి. మ‌నిషికి క‌ల‌లు రావ‌డం స‌హ‌జ‌మే అయినా.. గ‌ర్భ‌ణీ స్త్రీల‌కు మాత్రం కాస్త ఎక్కువ‌గా, విచిత్రంగా వ‌స్తుంటాయి. కొన్నిసార్లు మంచి కలలు వస్తే, మరికొన్నిసార్లు భయపెట్టే కలలు వస్తుంటాయి. మ‌రి అలాంటి క‌ల‌లు ఎందుకు వ‌స్తాయి..? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ టైమ్‌లో హార్మోన్స్ చేంజేస్ ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా మహిళలకు వింత కలలు వస్తుంటాయి.  ఎక్కువగా ఒత్తిడిగా ఫీల్ అయినప్పుడు ఇలాంటి సమస్య ఎదురవుతుంది. పుట్టేది ఎవరు ఆడా, మగా అని ఆలోచించడం వల్ల కూడా కలలు ఎక్కువగా వస్తాయి. 

 

అలాగే సముద్రాలు, నదులు ఇలాంటివి క‌ల‌లో కనబడుతూ అందులో మీరు తేలుతున్నట్లు కనిపిస్తే.. మీకు పుట్టబోయే బిడ్డ మీ గర్భంలోని ఉమ్మనీరులో తేలియాడుతోందని అర్థమ‌ట‌. మ‌రియు ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఏవైనా కప్పలు కానీ మిగతా జీవాలు కానీ కనిపిస్తే మహిళ తనకి వచ్చే బాధ్యతల గురించి ఆనందంగా ఉన్నట్లు అర్థమ‌ట‌. ఇలాంటి కలల గురించి ఎలాంటి చింత అవ‌స‌రం లేదు. తొలిసారి గర్భం దాల్చే మహిళల‌కు చిన్నతనంలో ప్రేమించి అనేక కారణాలుగా పెళ్ళి చేసుకోలేకపోతే వారికి సంబంధించిన కలలు కూడా వస్తాయి.  ఈ కలలకు అర్ధం..  ఇక ఆ వ్యవహారాలు మరచిపోయి.. భాధ్యతగల కొత్త తల్లిగా వ్యవహరించాలని గుర్తుచేయటం. కాబ‌ట్టి.. ప్రెగ్నెన్సీ టైమ్‌లో వ‌చ్చే చిత్ర‌విచిత్ర క‌ల‌ల గురించి ఎలాంటి భ‌యం పెట్టుకోకుండా మ‌న‌సును ప్ర‌శాంతంగా ఉంచుకోండి.

   
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: