వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు పూర్తిగా టీడీపీ నాయకుడిగా మారిపోయారు. ఇక ఇప్పుడు జగన్ తననేమీ చేయలేరని దీమాగా అంటున్నారు. తనపై అనర్హత వేటు పడే అవకాశమే లేదని వైసీపీ రెబల్‌ ఎంపి రఘురామకృష్ణంరాజు ధీమాగా ఉన్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌లో పేర్కొన్న నిబంధనలు తాను అతిక్రమించలేదంటున్న ఆయన పార్టీ జారీ చేసిన విప్‌ ఉల్లంఘించడానికి... ఇప్పటి వరకు పార్టీ విప్‌ జారీ చేయలేదన్నారు.


తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి వైకాపా జండాలు కప్పుకున్న వారిపై అనర్హత వేటు వేయలేని వారు... తనపై విధించాలని కోరడం ఏంటని రఘురామ అంటున్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీ నుంచి వచ్చి వైసీపీలో చేరి నిసిగ్గుగా తిరుగుతున్నారని రఘురామ అంటున్నారు. అలాంటి  వారికి వర్తించని నిబంధన తనకు ఎలా వర్తిస్తుందో చెప్పాలని రఘురామ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: