రెండు రోజులుగా హైదరాబాద్ వాసులను కలవరానికి గురి చేస్తున్న ఒక చిరుత ఆచూకీని ఎట్టకేలకు అధికారులు కనుగొన్నారు. దాని కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో దాని ఆచూకి దొరికింది. అడుగు జాడల ఆధారంగా చిరుత చిలుకూరు అటవీ ప్రాంతం వైపు వెళ్ళింది అని అధికారులు గుర్తించారు. 

 

మోయీనాబాద్ మండలం అజీజ్ నగర్ లో చిరుత గురించి చాటింపు వేయించారు. అది అక్కడే ఉందని అధికారులు గుర్తించారు. చిరుతను బంధించడానికి గానూ వ్యవసాయ పొలాల్లో అది ఉందని గుర్తించారు. చిలుకూరు పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలా అయినా సరే రెండు రోజుల్లో దాన్ని పట్టుకుని కచ్చితంగా బందిస్తాం అని అధికారులు పేర్కొన్నారు. ఇక దాన్ని పట్టుకోవడానికి బోన్ లు కూడా ఏర్పాటు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: