నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి చెందిన ఎనస్ధీషియన్ పని చేసిన డాక్టర్ సుధాకర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోడ్డుపై డాక్టర్ అర్ధనగ్నంగా హడావుడి చేయడంతో ఆయన్ను ట్రాఫిక్ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇటీవల ఆయన ఆస్పత్రిలో పీపీఈ కిట్ లు లేవు మాస్క్ లు లేవు అంటూ ఒక వీడియో విడుదల చేసారు. 

 

దీనిపై ఆయన ఒక వీడియో ని కూడా విడుదల చేయగా ఆయన్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ వీడియో బాగా వైరల్ కావడం కూడా సంచలనంగా మారింది. ఆయనను ఉద్యోగం నుంచి తొలగించిన నాటి నుంచి మానసికంగా బాధ పడుతున్నట్టు సమాచారం. ఇక ఆయన ప్రవర్తన తో ఇబ్బంది పడిన పోలీసులు కొట్టుకుంటూ తీసుకుని వెళ్ళారు అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: