యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ నేడు 60వ పుట్టిన రోజు జ‌రుపుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. బాల‌య్య 60వ ఒడిలోకి అడుగు పెడుతుండ‌డంతో సినిమా.. రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు ఆయ‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెపుతున్నారు. సినిమా రంగంలో మెగాస్టార్ చిరంజీవి నుంచి మొద‌లుకుని ఎంతో ప్ర‌ముఖులు ఆయ‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెపుతున్నారు. ఇక పుట్టిన రోజు సంద‌ర్భంగా బాల‌య్య త‌న అభిమానుల‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. బోయ‌పాటి శీను ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య న‌టిస్తోన్న సినిమా కు సంబంధించి ఫ‌స్ట్ రోరింగ్ అంటూ రిలీజ్ చేసిన టీజ‌ర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది.

అలాగే శివ‌శంక‌రి పాట పాడ‌డం కూడా మంచి జోష్ ఇచ్చింది. ఇక సురేష్ ప్రొడ‌క్ష‌న్ బాల‌య్య‌కు వెరైటీ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. బాల‌య్య న‌టించిన సినిమాలన్నింటిని ఓ వీడియో రూపంలో పొందు ప‌రిచింది. మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు సినిమా నుంచి బాల‌య్య హిట్ సినిమాలు.. స్పెష‌ల్ ఉన్న సినిమాల‌ను చూపిస్తూ శాత‌క‌ర్ణి వ‌ర‌కు ఈ వీడియో ఉంది. చివ‌ర్లో బాల‌య్య‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పారు. ఏదేమైనా బాల‌య్య‌కు సురేష్ ప్రొడ‌క్ష‌న్ విభిన్నమైన విషెస్‌తో ఆక‌ట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: