ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. సీఎం పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తున్నారు. సీఎం జగన్ తాజాగా డిగ్రీ విద్యార్థులకు మేలు జరిగేలా ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ఒకే తరహా ఫీజు విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఈ విద్యా సంవత్సరం నుంచి రాబోయే మూడేళ్లకు ఫీజులను ఫైనల్ చేసేందుకు సిద్ధమవుతోంది. 
 
పలు కాలేజీల్లో డిగ్రీ కోర్సులకు ఫీజుల్లో ఎక్కువ వ్య‌త్యాసాలు ఉన్న నేప‌థ్యంలో ఏకరూప ఫీజు ఉండాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కొత్త ఫీజుల నిర్ణయ ప్రక్రియను కమిషన్ రాబోయే పది రోజుల్లో పూర్తి చేయనుంది. ఏపీలో మొత్తం 1,441 డిగ్రీ కాలేజీలు ఉండ‌గా.. వీటిలో 1,153 ప్రైవేట్‌ అన్ ‌ఎయిడెడ్‌ కాలేజీలు, 137 ఎయిడెడ్‌ కాలేజీలు, 151 గవ‌ర్న‌మెంట్ కాలేజీలు ఉన్నాయి. ప్రైవేట్ మరియు అన్ ‌ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీలకు తొలిసారిగా ఉన్నత విద్య నియంత్రణ కమిషన్‌ ఫీజులను ఫైన‌ల్ చేయ‌నుంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: