కరోనా కట్టడిలో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. షాపింగ్ మాల్స్‌లో ప్రవేశద్వారం వద్ద తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ చెయ్యాలి అని ఆదేశాలు ఇచ్చింది. శానిటైజర్ డిస్పెన్సర్‌లు ఉండాలి అని స్పష్టం చేసింది. షాపులు & పార్కింగ్ స్థలాల ముందు సామాజిక దూరం కోసం నిర్దిష్ట గుర్తులు ఉండాలని పేర్కొంది. 

 

అదే విధంగా అక్కడ ప్రతీ రోజు కూడా శానిటేషన్ చెయ్యాలి అని స్పష్టం చేసింది. షాపింగ్ మాల్స్ కి అధిక సిబ్బంది వద్దని  సూచనలు చేసింది కేంద్రం. ఇక వస్తువులను సరఫరా చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అదే విధంగా సరుకులను డెలివరి ఇచ్చే సిబ్బందిని థర్మల్ స్క్రీనింగ్ చేయాలని పేర్కొంది. షాపులు / ఎలివేటర్లు / కేఫ్‌లు లోపల & వెలుపల సామాజిక దూరం తప్పనిసరని... గేమింగ్ ప్రాంతాలు / సినిమా హాళ్ళు మూసి వేయాలి అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: