వివాదాస్పదంగా మారిన ఎల్ ఆర్ ఎస్ విషయంలో తెలంగాణా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాల కారణంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో ఈ నెల 31 వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు గడువు పొడిగిస్తూ తెలంగాణా సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఎల్‌ఆర్‌ఎస్‌కు ఇప్పటి వరకు 19.33 లక్షల దరఖాస్తులు వచ్చాయి అని తెలంగాణా ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

అయితే దీని విషయంలో విపక్షాలు తీవ్ర స్థాయిలో  ఆరోపణలు చేస్తున్నాయి. ఎల్ ఆర్ ఎస్ ను కాంగ్రెస్ కట్టొద్దు అని డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎల్ ఆర్ ఎస్ ఉచితంగా చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రస్తుతం తెలంగాణాలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీనితో ఈ నిర్ణయం తీసుకుంది తెలంగాణా సర్కార్. కాంగ్రెస్ నేతలు ఉద్యమం కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

lrs