కడప జిల్లా రాజంపేట  పరిధిలోలో  గంజాయి స్వాధీనం చేసుకుని 8 మంది అక్రమ గంజాయి ముఠాను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్టణం కు చెందిన  గంజాయి ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కోటి రూపాయలు విలువ చేసే 52 కేజీల గంజాయి, 7సెల్ ఫోన్స్, బైక్ స్వాధీనం చేసుకున్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో వందల ఎకరాల్లో వందలాది మంది గంజాయి సాగు చేస్తున్నారు.

పండించిన గంజాయిని ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నారు. ఆంధ్రా ఒడిస్సా, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు తరలించి కిలో వెయ్యి చోప్పున అమ్మకాలు చేస్తున్నారు. జున్ నుంచి జనవరి వరకూ గంజాయి సాగు చేస్తున్నారు. నిందితులను  మీడియా  ముందు హాజరుపరచి వివరాలను కడప ఎస్పీ అన్బు రాజన్ వెల్లడించారు. ఇక కడప జిల్లాలో వారి లింకుల మీద కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: