తెలంగాణాలో ఈ మధ్య కాలంలో చిరుత పులుల హడావుడి ఎక్కువగా ఉంది. అటు పెద్ద పులులు కూడా ఎక్కడో ఒక చోట బయటకు వస్తూనే ఉన్నాయి. దీనితో సర్వత్రా కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ పులుల దెబ్బకు అధికారులు కూడా తల  పట్టుకునే పరిస్థితి వచ్చింది అని చెప్పాలి. ఎక్కడో ఒక చోట పులుల హడావుడి ఆందోళన కలిగిస్తూనే ఉంది. తాజాగా మరో చోట పులి హడావుడి మొదలయింది.

సంగారెడ్డి జిల్ల అందోల్ మండలం అక్సన్ పల్లి వద్ద చిరుత కలకలం సృష్టించింది. పొలం పనులు నిర్వహించి అటుగా వెళ్తుండగా చిరుతను గమనించామంటున్న రైతులు... అధికారులకు ఫిర్యాదు చేసారు. అటవీ అధికారులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న అధికారులు... చిరుత సంచారం నిజమేనా అన్న విషయాన్ని పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: