టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు కుప్పంలో మూడు రోజులుగా ప‌ర్య‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న శ‌నివారం సోష‌ల్ మీడియా ప్ర‌తినిధుల‌తో స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పార్టీ కార్యకర్తలతో కలిసి పనిచేయాలని సోషల్ మీడియా ప్రతినిధులకు దిశానిర్ధేశం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని ఆదేశించారు. సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకోవాలని చంద్రబాబు సూచించారు.

మునిసిప‌ల్‌, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లోనూ సోష‌ల్ మీడియా ద్వారా ఎక్కువుగా ప్ర‌చారం చేసుకోవాల‌ని... దీని ద్వారానే ప్ర‌త్య‌ర్థులు చేస్తోన్న ప్ర‌చారం తిప్పికొట్టాల‌ని సూచించారు. అయితే మూడో రోజు కూడా బాబు స‌మావేశంలో మ‌ళ్లీ  జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు వినిపించాయి. అయితే ఇవేవి పట్టించుకోని చంద్రబాబు మూడు నెలలకోసారి కుప్పంకు తానే వస్తానని తేల్చిచెప్పారు. తనకు వీలు కానీ పరిస్థితుల్లో లోకేష్ లేదంటే ఇతర నాయకులు వస్తారని చెప్పుకొచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: