తాజాగా గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర రు. 25 పెరిగి ఓవ‌రాల్‌గా రు. 826కు చేరుకుంది. ఈ ప్ర‌భావంతో గ్యాప్ రాయితీ రోజు రోజుకు త‌గ్గిపోతోంది. ఒక‌ప్పుడు రు. 500 వ‌ర‌కు వ‌చ్చే గ్యాస్ రాయితీ ఇప్పుడు ఏకంగా నాలుగు రూపాయ‌ల‌కు ప‌డిపోయింది.  ప్రస్తుతం సిలిండర్ ధర విజయవాడలో రూ. 816గా ఉండగా, వినియోగదారుల ఖాతాలో 16 రూపాయలు మాత్రమే జమ అవుతోంది. విశాఖలో సిలిండర్ ధర రూ. 800కు చేరుకోగా నాలుగు రూపాయల రాయితీ మాత్రమే లభిస్తోంది. పేద‌లు ఈ రాయితీ చూసి విల‌విల్లాడుతున్నారు.

ఒక్కో చోటా ఒక్కోలా గ్యాస్ రాయితీ వ‌ర్తిస్తున్నా ఎక్క‌డా కూడా రు. 50 కు మించి గ్యాస్ రాయితీ రావ‌డం లేదు. ఏపీలో  1.15 కుటుంబాలు ప్రతి నెలా గ్యాస్ సిలిండర్‌ను వినియోగిస్తున్నాయి. ఈ లెక్కన రాష్ట్రంలోని గ్యాస్ వినియోగదారులపై ఏడాదికి ఏకంగా రూ.4,140 కోట్ల భారం పడుతోంది. గ‌త ఫిబ్ర‌వ‌రిలోనే సిలిండ‌ర్ రేటు ఏకంగా మూడు సార్లు పెరిగింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: