దేశంలో కరోనా మహమ్మరి తీవ్రంగా విజృంభిస్తుంది. రెండు రోజులు త‌గ్గిన కేసులు మ‌ళ్లీ పెరిగాయి. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో 3,62,720 పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, 4136 మంది మ‌ర‌ణించారు. దేశ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఈ మహమ్మారి బారిన పడుతుండగా.. అనేక వేల మంది వైద్యం అందక, సరైన సమయానికి ఆక్సిజన్ అందక బాధితులు పిట్టల్లా రాలిపోతున్నారు. అయితే  గ‌త 24 గంట‌ల్లో బ్రెజిల్‌లో 25,200 పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రోజువారీ కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్న దేశాల్లో ఇండియా త‌ర్వాతి స్థానంలో బ్రెజిల్ నిలిచింది. అదేవిధంగా అమెరికాలో 22,261, ఫ్రాన్స్‌, ఇరాన్‌లో 18 వేల చొప్పున న‌మోద‌య్యాయి. ఈ దేశాల్లో కంటే భార‌త్‌లోని నాలుగు రాష్ట్రాల్లో అత్య‌ధికంగా కొత్త కేసులు న‌మోద‌వ‌డం గ‌మ‌నార్హం. అయితే WHO గ‌ణాంకాల ప్ర‌కారం ప్ర‌పంచవ్యాప్తంగా న‌మోద‌వుతున్న కొత్త కేసుల్లో భార‌త్‌లోనే ఎక్కువ‌గా ఉన్నాయి. క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు ఎక్కువ‌గా సంభ‌వించిన దేశాల్లో భార‌త్ అగ్ర‌భాగంలో నిలిచిందని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

WHO