ఏపీలో రేపు వైద్య ఆరోగ్య‌శాఖ ఆధ్వ‌ర్యంలో మెగా వ్యాక్సిన్ డ్రైవ్ చేప‌ట్ట‌నున్నారు. రేపు ఒక్క రోజే రాష్ట్రంలో 8ల‌క్ష‌ల వ్యాక్సిన్లు వేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.దీనికి సంబంధించి అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌ల‌కు వైద్య ఆరోగ్య‌శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్ప‌టికే ఒక్క‌రోజులోనే ఆరు ల‌క్ష‌ల వ్యాక్సిన్లు వేసి ఏపీ ప్ర‌భుత్వం చ‌రిత్ర సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు కోటి 22 ల‌క్ష‌ల 83వేల 479 డోసులు వేశారు.ఐదేళ్ల‌లోపు ఉన్న పిల్ల‌ల త‌ల్లుల‌కు ఐదు ల‌క్ష‌ల 29వేల మందికి మొద‌టి డోస్ వ్యాక్సిన్ వేశారు.

రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొర‌తలేదు. కేంద్రం నుంచి ప్ర‌తి రోజు రాష్ట్రానికి వ్యాక్సిన్లు వ‌స్తున్నాయి.ఇప్ప‌టివ‌ర‌కు వ్యాక్సిన్ల నిల్వ అధికంగానే ఉంది. గ‌త వారం రోజుల వ‌ర‌కు వ్యాక్సిన్ల కొరత ఎక్కువ‌గానే ఉన్న‌ప్ప‌టికి ప్ర‌ధాని మోడీ రాష్ట్రాల‌కు వ్యాక్సిన్లు ఉచితంగా అందిస్తామ‌ని మ‌రోసారి చెప్ప‌డంతో వ్యాక్సిన్ల స‌ర‌ఫ‌రాని కేంద్రం వేగ‌వంతం చేసింది.వ్యాక్సిన్ల కొర‌తపై ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి అన్ని రాష్ట్రాల సీఎంల‌కు లేఖ‌లు రాయడం,ఆ త‌రువాత కేంద్రం రాష్ట్రాల‌కు ఉచితంగానే వ్యాక్సిన్లు స‌కాలంలో అందిస్తామ‌ని చెప్ప‌డంతో అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేష‌న్ ప‌క్రియ వేగ‌వంతం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: