జర్మనీలోని ఒక కెమికల్ పారిశ్రామిక పార్క్ లో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించారు, 31 మంది గాయపడ్డారు ప్రమాదం జరిగి చాలా గంటలు అవుతున్నప్పటికీ ఇంకా కొంతమంది ఆచూకీ తెలియలేదు. ఇది కెమికల్ ప్రమాదం కావడంతో పరీక్షల అనంతరం స్థానికులకు ఎలాంటి ప్రమాదం లేదని అగ్నిమాపక అధికారులు తెలిపారు. కొలోన్ సమీపంలోని లెవెర్కుసేన్లోని చెంపార్క్ సైట్ వ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రంలో పేలుడు వల్ల పెద్ద నల్లటి మేఘాలు అలుముకున్నాయి. 



ఈ పేలుడు వల్ల సంభవించిన మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బందికి దాదాపు నాలుగు గంటలు పట్టింది. ఉదయం 9:40 గంటలకు ద్రావకాల నిల్వ ట్యాంకుల్లో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రాంతానికి కొన్ని రోజులు దూరంగా ఉండాలని, పిల్లలను బయట ఆడుకోవద్దని, పెరటి నుండి పండ్లు, కూరగాయలు తినవద్దని అక్కడి ప్రజలను హెచ్చరించారు. సమీపంలోని పలు ప్రధాన రహదారులను పోలీసులు చాలా గంటలు మూసివేశారు. ప్రమాదానికి గల కారణం గురించి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: