ఎపి సీఎం వైస్ జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం రోజు కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై సమావేశం నివహించారు. ఈ సమీక్షలో కరోనా వ్యాక్సినేషన్ ప్రకియ ను త్వరి తగతిన పూర్తి చేయాలంటూ అధికారులకు స్ప్రష్టమైన ఆదేశాలు జారీ చేసారు. ఆగష్టు లో థర్డ్ వెవ్ ముంచుకోస్తుంది అంటూ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యం లో వైస్ జగన్ ఈ సమీక్ష ఏర్పాటు చేసారు. వైస్ జగన్ మాట్లాడుతూ, కరోనా కట్టడికి కావాల్సిన అన్ని విషయాల పైనా దృష్టి సారించాలని, డీటైప్‌సిలెండర్లు, కాన్సన్‌ట్రేటర్లు, ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటు మరియు వాటి నిర్వహణ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలనీ సూచించారు. జిల్లాల వారీగా ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు కోసం స్పెషల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలనీ సీఎం వైస్ జగన్ అధికారులను ఆదేశించారు. రానున్న రోజుల్లో ప్రయివేట్ ఆసుపత్రుల్లో కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ ని ఏర్పాటు చేయాలనీ జగన్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: