ప‌దవీ కాంక్ష‌తో ఎమ్మెల్యే జోగి ర‌మేష్ ర‌గిలిపోతున్నార‌ని ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు అన్నారు. జ‌డ్‌ప్ల‌స్ భ‌ద్ర‌త ఉన్న ప్ర‌తిప‌క్ష నేత‌ ఇంటిపైకి దాడికి వెళ్ల‌డ‌మంటే ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌లు ఎలా అర్థం చేసుకోవాల‌ని ప్ర‌శ్నించారు. శాంతియుత నిర‌స‌న‌కు వెళ్లేట‌ప్పుడు అన్నికార్లు, అంత‌మంది అనుచ‌రులు ఎందుక‌న్నారు. చంద్ర‌బాబునాయుడిపై గ‌తంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఇష్టారీతిన మాట్లాడార‌ని, అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు ప‌లు వ్యాఖ్య‌లు చేశార‌ని, వాట‌న్నింటికీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ క్ష‌మాప‌ణ చెబుతారా? అని ర‌ఘురామ డిమాండ్ చేశారు. ప్ర‌తిప‌క్షానికి చెందిన‌వారు ఏ కార్య‌క్ర‌మాలు చేస్తున్నా భారీగా పోలీసుల‌ను మొహ‌రించే ప్ర‌భుత్వం ప్ర‌తిప‌క్ష నేత ఇంటిపైకి దాడిచేయ‌డానికి అధికార పార్టీ ఎమ్మెల్యే వెళుతుంటే ఎందుకు స‌రైన భ‌ద్ర‌త క‌ల్పించ‌లేక‌పోయార‌న్నారు. తెలుగుదేశం, వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య తోపులాట జ‌రిగింద‌ని, ప‌రిస్థితి ఏ మాత్రం అదుపుత‌ప్పినా ఇప్ప‌టికే రాష్ట్రంలో నానా గంద‌ర‌గోళం జ‌రిగివుండేద‌ని, అల్ల‌ర్లు త‌లెత్త‌కుండా చూడాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపైనే ఉంద‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: