తెలంగాణ‌లో ఇంట‌ర్ ప్ర‌థ‌మ‌సంవ‌త్స‌రం ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని హైకోర్టులో గురువారం పిటీష‌న్ దాఖ‌లైంది. ప్ర‌మోట్ అయిన విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించొద్ద‌ని త‌ల్లిదండ్రుల సంఘం పిటీష‌న్ వేసింది. ప‌రీక్ష‌లను ర‌ద్దు చేసి విద్యార్థులంద‌రినీ పాస్ చేయాల‌ని పిటీష‌న‌ర్ త‌రుపున‌ న్యాయ‌వాది రాపోలు భాస్క‌ర్‌రావు కోర్టును కోరారు.  క‌రోనా కార‌ణంగా ఇంట‌ర్‌ మొద‌టి సంవ‌త్స‌రం నుంచి ప‌రీక్ష‌లు లేకుండా ద్వితీయ‌సంవ‌త్స‌రానికి ప్ర‌మోట్ చేశారు. అయినా ప్ర‌భుత్వం అక్టోబ‌ర్ 25 నుంచి ప‌రీక్ష‌లు పెడుతోంద‌ని వాపోతున్నారు.

మ‌రోవైపు కొద్దిసేప‌టిక్రిత‌మే ఇంట‌ర్ మొద‌టిసంవ‌త్స‌రానికి సంబంధించిన హాల్‌టికెట్ల‌ను విడుద‌ల చేసింది ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు. ఇది ఇలా ఉండ‌గా.. తెలంగాణ విద్యాశాఖ మంత్రి స‌బితాఇంద్రారెడ్డి దీనిపై ఒక క్లారిటీ ఇచ్చారు. అక్టోబ‌ర్ 25 నుంచి ప‌రీక్ష‌లు ప్రారంభం అవుతాయి. అందులో ఎలాంటి మార్పు లేదు అని స్ప‌ష్టం చేశారు. 4.58 ల‌క్ష‌ల మంది విద్యార్థులు ప‌రీక్ష‌లు రాయ‌బోతున్నార‌ని, విద్యార్థుల‌కు మెటీరియ‌ల్ కూడ అంద‌జేశామ‌ని, ప‌రీక్ష‌ల‌కు స‌న్న‌ద్ధ‌మై రాయాలని మంత్రి సూచించారు. స‌మయానికి త‌గ్గ‌ట్టు ప‌రీక్ష‌లు పెట్టాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంటుంద‌ని, ప్ర‌యివేటు క‌ళాశాల‌లు కూడ స‌హ‌క‌రించాల‌ని కోరారు స‌బితా.
   

మరింత సమాచారం తెలుసుకోండి: