ఆంధ్రప్రదేశ్ ఏంటి.. రష్యాతో పోటీ పడటం ఏంటి అనుకుంటున్నారా.. అవును.. ఓ విషయంలో బ్రిక్స్ దేశాలతో ఏపీ పోటీపడుతోందని సాక్షాత్తూ సీఎం జగన్ చెప్పారు. 18 నుంచి 23 సంవత్సరాల వయస్సు వారు కాలేజీల్లో చేరుతున్న వారి సంఖ్య విషయంలో బ్రిక్స్ దేశాలతో ఏపీ పోటీపడుతోందట. దీన్ని జీఈఆర్‌ రేషియో అంటారు. ఏపీలో అమలు చేస్తున్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల వల్ల 18 నుంచి 23 సంవత్సరాల వయస్సు వారు కాలేజీల్లో చేరుతున్న వారి సంఖ్య బాగా పెరుగుతోందట.

ఈ విషయంలో బ్రిక్స్‌ దేశాలు చాలా మెరుగ్గా ఉన్నాయని.. సీఎం జగన్ చెప్పారు. ఈ రేషియో బ్రెజిల్‌లో 53 శాతం, రష్యా 86 శాతం, చైనాలో 58 శాతం, ఇండియా 29 శాతంగా ఉందట. దీన్ని 2035 వచ్చే సరికి ఏపీ రాష్ట్రంలో 70 శాతం తీసుకెళ్లేందుకు అడుగులు వేస్తున్నారట. అందుకోసమే విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: