భారత దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో దాదాపు 40 రోజుల పాటు నుండి లాక్ డౌన్ ఈ విధానం అమల్లోకి వచ్చింది. దీనితో అన్ని రంగాలు మూతపడ్డాయి. అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా చాలానే ఎదుర్కొన్నారు. ఇక లాక్ డౌన్ కారణంతో దేశవ్యాప్తంగా మారుతి సంస్థతో పాటు ఇతర కార్ల తయారీ కంపెనీలు కూడా మూతపడ్డాయి. ఇక కొన్ని ప్రాంతాలలో లాక్‌డౌన్‌ సడలింపు జరగడంతో.. మారుతి సుజుకి ఇండియాకు సంబంధించిన 600 డీలర్షిప్ లను ప్రారంభం అయ్యాయి.

 

IHG


ఇక అంతే కాకుండా దేశంలోని మారుతి సుజుకి ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సేవలు కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఆన్లైన్ ద్వారా ఆర్డర్లను తీసుకుంటూ ఇంటికే వాహనాలను అందించే దిశగా ఏర్పాట్లు చేసింది మారుతి సంస్థ. అంతేకాకుండా ఈ తరుణంలో వినియోగదారులకు అనుకూలంగా ఉండే విధంగా సేవలు అందించేందుకు మేము సిద్ధమని గత కొన్నాళ్లుగా అందుకు అనుగుణంగా ప్రణాళికలు కూడా తయారు చేసి అమలులోకి తీసుకొని వస్తున్నాము అని మారుతి సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీవాస్తవ తెలియచేశాడు. అంతేకాకుండా ఇప్పటికే తమ సేవలు మొదలు పెట్టేందుకు అన్ని రాష్ట్రాలలో డీలర్ల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు.

 

 

ఇక దేశం మొత్తం మీద 1960 నగరాలలో 3080 డీలర్ షిప్ లు, అలాగే 474 అవుట్ లెట్ లు వాహనాలు అమ్మకాలు మొదలు పెట్టాయని తెలియజేశారు. ఇక వినియోగదారులకు అనుగుణంగా ఆర్డర్ చేసిన కార్లను ఇంటికే అందించే ఏర్పాటు చేశామని తెలిపారు. అంతేకాకుండా ఈ తరుణంలో పరిశుభ్రతను పాటిస్తూ టెస్ట్ డ్రైవ్ సౌకర్యాన్ని అందజేస్తుంది మారుతి సుజుకి. నిజానికి కరోనా దెబ్బకి ఆటో మొబైల్ ఇండస్ట్రీ కుదేలు అయ్యిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: