ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఆర్థిక‌మాంద్యం ఎఫెక్ట్ ఎలా ఊపేస్తుందో ?  చూస్తూనే ఉంటున్నాం. ఎక్క‌డిక‌క్క‌డ పారిశ్రామిక‌వేత్త‌లు ఆర్థిక‌మాంద్యం ప్ర‌భావాన్ని ముందుగానే ఊహించుకుని జాగ్ర‌త్తలు తీసుకుంటున్నారు. ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా ముంద‌స్తుగానే ఎలెర్ట్ అవుతున్నాయి. ఇక అటు కేంద్ర ప్ర‌భుత్వం కూడా ఆర్థిక‌మాంద్యం విష‌యంలో ముందుగానే ప్ర‌జ‌ల‌ను ఎలెర్ట్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది.


ఇదిలా ఉంటే ఆర్థిక‌మాంద్యం ఎఫెక్ట్ ధ‌న‌వంతులు, పారిశ్రామిక‌వేత్త‌ల నుంచి సామ‌న్యుల వ‌ర‌కు తీవ్రంగా ప్ర‌భావం చూప‌నుంది. ఆర్థిక‌మాంద్యం ఎఫెక్ట్ ఇప్ప‌టికే చాలా రంగాల‌పై ప‌డ‌గా... ఇది అనూహ్యంగా హైద‌రబాద్ గ‌ణ‌ప‌య్య ల‌డ్డూపై సైతం ప‌డింది. హైద‌రాబాద్ గ‌ణ‌ప‌తి ఉత్స‌వాల్లో ల‌డ్డూల రేట్లు ఎలా ప‌లుకుతాయో ? ప‌్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. కొన్ని ఏరియాల్లో ముఖ్యంగా బాలాపూర్‌, భోలాక్‌పూర్ లాంటి చోట్ల ల‌డ్డూలు వేలంలో ల‌క్షలు ప‌ల‌క‌డంతో పాటు.. ప్ర‌తి యేటా రేట్లు పెరిగిపోతుంటాయి.


భోలాక్‌పూర్‌లో ప్ర‌తియేటా స్వామి చేతిలో బంగారు ల‌డ్డూ పెడ‌తారు. గ‌తేడాది 120 గ్రాముల బంగారు ల‌డ్డూ రూ 8.1 ల‌క్ష‌కు వేలంలో అమ్ముడైంది. ఈ యేడాది గ‌తేగాది కంటే 3 గ్రాములు అద‌నంగా 123 గ్రాముల ల‌డ్డూను రూ.5 ల‌క్ష‌ల ఖ‌ర్చుతో ఏర్పాటు చేశారు. గ‌తేడాది కంటే 3 గ్రాములు పెంచినా వేలంలో ల‌డ్డూ రేటు మాత్రం గతేడాది కంటే త‌క్కువే ప‌లికింది. రూ. 5001తో ప్రారంభ‌మైన ఈ వేలం చివ‌ర‌కు 7.56 ల‌క్ష‌ల ద‌గ్గ‌ర ముగిసింది. స్థానిక చేప‌ల వ్యాపారి ఒక‌రు ఈ ల‌డ్డూ వేలంలో సొంతం చేసుకున్నారు. ఆర్థిక‌మాంద్యం ఎఫెక్ట్‌తోనే ఈ సారి రేటు బాగా త‌గ్గిన‌ట్టు చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: