ప్రస్తుతం దేశం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్న నేటి రోజుల్లో కూడా ఇంకా మూఢనమ్మకాల మాయలో మునిగిపోయిన మనుషులు కనిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఆధునిక జీవనశైలిలో  కూడా ఇంకా మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అని నమ్ముతూ చేయకూడని పనులన్నీ చేసేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బురిడీ బాబాలు చెబుతున్న మాటలను గుడ్డిగా నమ్మి చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న ఘటనలు కూడా ఎన్నో వెలుగులోకి వస్తూ ఉన్నాయి.  తాంత్రికుడు చెప్పిన మాటలు నమ్మి నేటి ఆధునిక కాలంలో కూడా నరబలులు ఇస్తూ ఉండడం అందరిని ఉలిక్కిపడేలా చేస్తూ ఉంది.


 ఇక ఇటీవలే తమిళనాడులో ఒక విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఏకంగా జ్యోతిష్యుడు ఇచ్చిన సలహా విని విషపూరితమైన నాగుపాము ముందు ఏకంగా నాలుక చాచాడు ఒక వ్యక్తి. దీంతో ఆ పాము ఊరుకుంటుందా ఏకంగా అతని నాలుగు పై కాటు వేసింది. దీంతో అక్కడే ఉన్న జ్యోతిష్యుడు సదరు వ్యక్తి నాలుక కోసేసాడు అని చెప్పాలి..  ఈ ఘటన ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తుంది అని చెప్పాలి. కోపిశెట్టి పాలాయంకు చెందిన 54 ఏళ్ల రాజా అనే వ్యక్తి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.


 అయితే అతనికి పాము కాటు వేసినట్లుగా గత కొన్ని రోజుల నుంచి తరచూ కలలు వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇదే విషయంపై ఒక జ్యోతిష్యుడిని  కలిశాడు. అయితే పాముల ఆలయానికి వెళ్లి పూజలు చేయాలని ఆ జ్యోతిష్యుడు సూచించాడు. అంతేకాకుండా ఒక నాగుపాము ముందు ఇక పాము లాగానే మూడుసార్లు నాలుకను బయటికి చాచాలి అంటూ ఒక పిచ్చి సలహా ఇచ్చాడు. అయితే జ్యోతిష్యుడు సలహాని తూచా తప్పకుండా పాటించిన రాజ పాము ముందు తన నాలుకను మూడుసార్లు బయటకు చాచాడు. దీంతో విష సర్పం అతని నాలుకపై కాటు వేసింది. దీంతో అక్కడే ఉన్న పూజారి ఇది గమనించి అతని నాలుకను కోసేసాడు. ఇక వెంటనే తెగిపోయిన నాలుకను పట్టుకుని ఆసుపత్రికి పరిగెత్తుగా చివరికి కుట్లు వేసి నాలుకను అతికించారు వైద్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి: