ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఇంటర్నెట్లో ఏ మూలన ఏం జరిగినా కూడా ఇట్టే వాలిపోతూ ఉన్నాయి. అయితే ఇలా సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చే ఎన్నో ఘటనలు కొన్ని కొన్ని సార్లు ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి అని చెప్పాలి. మనం రోజు చేసే పనులలోనే ఇంత మతలబ్ దాగి ఉందా అని ఎంతోమందికి అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కొవలోకి చెందినదే. ఇప్పుడైతే గూగుల్ పే, ఫోన్ పేలు వచ్చి చిల్లర కష్టాలు తీరిపోయాయి. ఎంత చిల్లర కావాలన్నా  ఫోన్లోనే పంపిస్తున్నారు.


 అయితే నేటి రోజుల్లో కూడా అక్కడక్కడ చిల్లర కష్టాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఒకవేళ మనకు ఎప్పుడైనా ఒకటి రెండు మూడు రూపాయలు రావాల్సి ఉంటే పోతే పోనీ అని ఎంతోమంది వదిలేసుకుంటూ ఉంటారు అని చెప్పాలి. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం అలా వదిలేసుకోలేదు. తనకు రావాల్సిన మూడు రూపాయల కోసం ఏకంగా కోర్టుకి ఎక్కాడు. దీంతో మూడు రూపాయలుకు బదులు అతనికి 25000 వచ్చాయి. ఇలా కస్టమర్ కు చిల్లర ఇవ్వని ఓ యజమానికి భారీ జరిమాన పడింది ఒరిస్సాలో ఈ ఘటన వెలుగు చూసింది.


 సాంబల్ పూర్కు చెందిన ఒక కస్టమర్ ఫోటో కాఫీ కోసం వెళ్ళాడు. అయితే ఫోటో కి రెండు రూపాయలు అని ఓనర్ చెప్పాడు. అయితే కస్టమర్ ఐదు రూపాయలు ఇచ్చాడు. అయితే ఆ కస్టమర్ కి తిరిగి మూడు రూపాయలు ఇచ్చేందుకు ఓనర్ నిరాకరించాడు. పైగా మూడు రూపాయలు అడిగినందుకు అతడినే బెగ్గర్ అంటూ తిట్టి అక్కడ నుంచి పంపించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన కస్టమర్ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ను ఆశ్రయించాడు. దీంతో అధికారులు ఈ ఘటనపై విచారణ జరిపారు. ఇక తర్వాత ఫోటో షాప్ యజమానికి 25000 జరిమానా విధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: