ఇలా సోషల్ మీడియా ప్రపంచంలోనే బ్రతికేస్తున్న మనిషి తల ఎత్తి బయట ప్రపంచాన్ని చూడ్డానికి మాత్రం అస్సలు ఇష్టపడటం లేదు. అయితే కొంతమంది సోషల్ మీడియా చూసి ఎంటర్టైన్మెంట్ పొందుతుంటే.. ఇంకొంతమంది మాత్రం సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇలా పాపులారిటీ సంపాదించడం కోసం కొన్ని కొన్ని సార్లు ఏకంగా ప్రాణాలను సైతం ప్రమాదంలో పెట్టే విన్యాసాలను చేస్తూ ఉండడం కూడా నేటి రోజుల్లో చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక యువకుడు ఇలాంటి విన్యాసమే చేశాడు. చివరికి ఊహించని రీతిలో జీవితాన్ని దుర్భరం చేసుకున్నాడు అని చెప్పాలి.
ముంబైలోని ఒక రైల్వే స్టేషన్ లో కదులుతున్న లోకల్ ట్రైన్ పట్టుకొని ఓ యువకుడు ఫ్లాట్ ఫాంపై విన్యాసం చేసిన ఒక ఓల్డ్ వీడియో వైరల్ అవుతుంది. అయితే దీనిని ఒక నెటిజన్ షేర్ చేయడంతో రైల్వే పోలీసులు స్పందించారు. అతడిని గుర్తించి ఇంటికి వెళ్లి చూసారు. అక్కడికి వెళ్ళాక పోలీసుల షాక్ అయ్యారు. ఎందుకంటే ఒక కాలు చెయ్యి కోల్పోయి అతను బెడ్ పై కనిపించాడు. ఇలాంటి విన్యాసాలు చేయడం వల్ల అతనికి ప్రమాదం జరిగి కాలు చేయిపోయిందని పోలీసులు గుర్తించారు. ఇప్పటికైనా ఇలాంటి పిచ్చి పనులు మానుకోవాలి అంటూ సెంట్రల్ రైల్వే హెచ్చరించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి