రవిప్రకాశ్ తొలి వెలుగు వెబ్ సైట్ ను చాలా ఏళ్ల కిందటనే ప్రవేశపెట్టారు. రవి ప్రకాశ్ అనంతరం టీవీ9, మోజో టీవీ, తేజకు బ్యూరో చీప్ గా చేశారు. ఇవన్నీ చేసినా తొలివెలుగు సపరేట్ సంస్థగా నడుస్తూనే ఉంది. జర్నలిజం రూపు రేఖలు మార్చడానికి ప్రయత్నాలు చేసిన వ్యక్తి రవిప్రకాశ్.
రవి ప్రకాశ్ పెట్టిన తొలి వెలుగు లో యూట్యూబ్ చానల్ ను జర్నలిస్టు రఘు తీసుకురావడం దాన్ని ఆయన ఇంటర్వ్యూలతో ఫేమస్ చేయడం జరిగింది.


ఇప్పుడు ఆర్ టీవీ అని రవిప్రకాశ్ ప్రత్యేక ఛానల్ ను పెడుతున్నారు. అయితే ఇది సీఎం కేసీఆర్ ఇస్తున్న ఫండ్స్ తోనే పెడుతున్నారని రఘు ఆరోపించారు. తొలివెలుగు లో చాలా వరకు బీఆర్ ఎస్ కు వ్యతిరేకంగా ఉన్న ఇంటర్వ్యూలను డిలేట్ చేశారని రఘు అన్నారు. ఇది రవిప్రకాశ్ చేయించారని రఘు ఆరోపించారు. దీంతో మన తొలి వెలుగు యూట్యూబ్ ఛానల్ ని రఘు పెట్టుకున్నారు.


ఇలానే రవి ప్రకాశ్ టీవీ9 అనే ఛానల్ నుంచి కూడా వెళ్లి పోయేలా చేశారని అదే విధానంలో రఘు కూడా బయటకు వచ్చేశారని సమాజంలో వినిపిస్తున్న టాక్. కానీ రఘు తెలంగాణకు చెందిన బీసీ, రవిప్రకాశ్ ఆంధ్రకు చెందిన వ్యక్తి కావడం వల్లే ఇలా చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ ను టీవీ9 రెచ్చగొట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు రవిప్రకాశ్ ఎక్కువగా మద్దతు ఇస్తారు. దీని గురించి ఎక్కువగా తెలియని వ్యక్తులు రవి ప్రకాశ్ పై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారనే వాదన ఉంది.


రవి ప్రకాశ్ ను సైద్దాంతికంగా విమర్శించే వారి కంటే వ్యక్తిగతంగా విమర్శించే వారు ఎక్కువయ్యారు. రఘుకు నచ్చక వెళ్లిపోయారు. కానీ దాన్ని కులానికి అంటగుడుతున్నారని.. ఇన్ని రోజులు ఛానల్ లో చేసినపుడు కులం గురించి ఆలోచించకుండానే ఆయన్ను చేర్చుకున్నారు కదా అనే వారు కూడా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: