
ఈ ఆరోపణలు చేస్తుంటే మరో వైపు ఉక్రెయిన్ లోని మరియపోల్, తదితర ఆక్రమిత ప్రాంతాల్లో పర్యటించిన వీడియోలను రష్యా ప్రెజెంట్ చేస్తుంది. రష్యా అధ్యక్షుడు ఈ ఆరోపణల అనంతరం ప్రెస్ మీట్ పెట్టారు. మీ ఆరోగ్యం పై అమెరికా అనేక ఆరోపణలు చేస్తుందని విలేకరులు అడిగారు. దీనికి కనిపిస్తున్నాను కదా.. పనికి మాలిన ప్రశ్నలు ఆపి ఏదైనా విషయం అడగండని హెచ్చరించారు.
కానీ అమెరికా ప్రస్తుతం కొత్త రకం అనుమానాలు రేకేత్తించే ప్రశ్నలు అడిగింది. రష్యాలో పుతిన్ ను పోలిన ఇద్దరు ముగ్గురు డూప్లికేట్లను తయారు చేశారు. ఆయన తీరుగానే ఉండేట్లు చేశారని ఆరోపించారు. గతంలో జర్మన్ లో హిట్లర్, ఇరాక్ లో సద్దాం హుసేన్ ఇలాంటి ప్రయత్నాలు చేసినట్లు ఉందని తెలిపారు. ఏకంగా సద్ధాం హుసేన్ డూప్లికేట్ ను అమెరికా పట్టుకుంది.
పుతిన్ అనారోగ్యంతో ఉన్నాడని కదల్లేక పోతున్నట్లు ఒక విజువల్, ఇంకో పక్క ఉక్రెయిన్ కు వెళ్లిన పుతిన్ ను చూస్తే యాక్టివ్ గా ఉన్నట్లు మరో విజువల్ తో తేడా ఎక్కువగా ఉందని ఆరోపిస్తుంది. ఆర్టిపిషీయల్ ఇంటిలిజెన్స్ ద్వారా పుతిన్ లాంటి వారు ఇద్దరు, ముగ్గురు ఉన్నట్లు అమెరికా ఆరోపిస్తుంది. అమెరికా చేసిన ఆరోపణలతో పుతిన్ నిజంగానే ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నాడా? లేక ఏదైనా సంఘటన జరిగినా పుతిన్ కు ఏమీ జరగకుండా తీసుకుంటున్న జాగ్రత్తలా.. ఏదైనా ఇద్దరు ముగ్గురు డూప్లికేట్ల వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.