కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు బలైపోయాయి. అయితే అన్నీ దేశాల్లోకి బాగా ఎక్కువగా బలైంది మాత్రం సుమారు పది దేశాలనే చెప్పాలి. విచిత్రమేమిటంటే ఈ పది దేశాలు కూడా మొదట్లో కరోనా వైరస్ ను చాలా తేలిగ్గా తీసుకునే తర్వాత  బాగా దెబ్బ తిన్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రపంచం మొత్తం మీద వైరస్ బాధితుల సంఖ్య సుమారు 40 లక్షలకు చేరుకుంది. అలాగే మరణాల సంఖ్య కూడా దాదాపు 2.8 లక్షలుగా రిజిస్టర్ అయ్యింది. భవిష్యత్తులు ఈ సంఖ్యలు ఎక్కడికి చేరుకుంటాయో ఎవరూ చెప్పలేకున్నారు.

 

ఇక అసలు విషయానికి వస్తే బాగా వరస్ట్ ఎఫెక్టెడ్ దేశాల్లో అమెరికా, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాన్, రష్యా, టర్కీ, బ్రెజిల్ దేశాలున్నాయి. అమెరికాలో బాధితుల సంఖ్య సుమారు 13 లక్షలుంటే మరణించిన వారి సంఖ్య 76 వేలకు దగ్గరలో ఉంది.  ఇటలీలో బాధితులు 2.6 లక్షలుంటే మరణాల సంఖ్య సుమారు 30 వేలకు దగ్గరలో ఉంది. ఇక స్పెయిన్ లో బాధితులు 2.6 లక్షలుంటే మరణించిన వారి సంఖ్య 26,100. బ్రిటన్లో కూడా 2.3 లక్షల మంది బాధితులుంటే దాదాపు 35 వేల మంది మరణించారు.

 

మొదట్లో వైరస్ సమస్య తక్కువగా ఉన్నట్లు అనిపించినా ఒక్కసారిగా పెరిగిపోతున్న దేశాల్లో రష్యానే ముందుగా చెప్పుకోవాలి. గురువారం నాటికి రష్యాలో సుమారు  1.8 లక్షల కేసులు నమోదయ్యాయి. 1650 మంది మరణించారు.  మొదట్లో వైరస్ తీవ్రతను నిర్లక్ష్యం చేసిన కారణంగా ఇపుడు రష్యా ఫలితం అనుభవిస్తోంది. అలాగే ఫ్రాన్స్ లో కూడా  1.74 లక్షల కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య దాదాపు 26 వేలు నమోదయ్యాయి.  

 

అలాగే జర్మనీలో 1.7 లక్షల కేసులు నమోదవ్వగా మరణాల సంఖ్య 7400 నమోదయ్యాయి. టర్కీలో 1.34 లక్షల కేసులు, 3700 రిజస్టర్ అయ్యాయి. ఇక బ్రెజిల్ లో 1.28 లక్షల కేసులు రిజస్టర్ అవ్వగా 8700 మంది చనిపోయారు.  ఇక ఇరాన్ లో 1.1 లక్షల మంది చనిపోగా 6500 మంది సుమారు మరణించారు.  వైరస్ కు పుట్టినల్లయిన చైనాలో  83 వేల మంది బాధితులుండగా సుమారు 4700 మంది చనిపోయారు. చివరగా మనదేశం విషయం చూస్తే మొత్తం 56 వేల మంది బాధితులున్నారు. సుమారుగా 2 వేలమంది చనిపోయినట్లు రికార్డులు చెబుతున్నాయి.

 

ఇదే సమయంలో వైరస్ ముప్పును గ్రహించి ముందుగా మేల్కొన్న సింగపూర్, ఖతార్, కువైట్ లాంటి అనేక చిన్న దేశాలు బాధితుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యను కూడా బాగానే నియంత్రించగలిగాయి. అంటే ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే నిర్లక్ష్యం కారణంగానే పెద్ద దేశాల్లో సమస్య బాగా పెరిగిపోతే ముందు జాగ్రత్త ఫలితంగానే చిన్న దేశాలు  కాస్త ప్రశాంతంగా ఉన్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: