దేశంలో ఎదురులేని రాజకీయ శక్తిగా ఎదిగింది బీజేపీ. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రజాస్వామ్య దేశంలో గతంలో ఎన్నడూ లేనంత బలీయమైన ప్రధానిగా నరేంద్రమోడీ తనను తాను మలచుకున్నారు. చాలా విషయాల్లో ఇందిరాగాంధీ రికార్డులను సైతంతిరగ రాసేశారు. అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోందని ఆయన ప్రత్యర్థుల ను విమర్శిస్తూ ఉంటారు.


ఎంతటి బలీయమైన రాజుకైనా, ప్రధానికైనా అధికారం శాశ్వతం కాదు. అధికారం ఎప్పటికి అశాశ్వతమే! సర్వం సహా సార్వభౌముడైనా సరే! సామంతరాజైన సరే! కాస్త వెనకాముందు అంతే తేడా!


అందులోనూ మతం భావం ఆలోచన అంటూ ఎప్పుడు గిల్లి కజ్జాలు పెట్టుకొనే మనస్తత్వం కమలనాధుల స్వంతం. అందుకే కమలనాథులకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. నరేంద్ర మోడీ పాలనకు, బెంగాల్ సవాల్ గా నిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి.


నమో రాజసూయాన్ని అడ్డుకునే సూచనలు . పశ్చిమ బెంగాల్ లో కనిపిస్తున్నాయి. బెంగాల్ వేదికగా బీజేపీ వ్యతిరేకత ప్రారంభం కాబోతోందనే సందేహాలు అలుముకుంటున్నాయి.


మమత బెనర్జీ తప్పించి - దేశంలోని ప్రముఖ నాయకులందరినీ - క్లిన్ ఇమేజ్ ఉన్న నరేంద్ర మోడీ అదుపులో ఉంచ గలుగుతున్నారు. తొలిసారిగా ఇందిరా గాంధీని మించి భారత్ లో బడాబడా రాజకీయ నాయకులను వారే పార్టీ వారైనా సరే! భయం గుప్పిట్లో పెట్టుకోవడం నరేంద్ర మోడీకే చెల్లింది. నమో పాలన ప్రారంభమై ఏడేళ్లవుతున్నా బీజేపీని, మోడీని దీటుగా ఎదిరించే నాయకులే లేకుండా పోయారు.


దళిత సింబల్ గా ముద్రపడ్డ - బి ఏస్ పి అధినేత్రి - జాతీయ నాయకురాలు మాయావతి,

సమాజ్ వాదీ పార్టీ అధినేత గా ఒక వెలుగు వెలిగిన ములాయం సింగ్ యాదవ్,

ఇందిరా గాంధీకె దడ బుట్టించిన మరాఠా ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్,  

మాజీ ప్రధాని కర్ణాటక దేవెగౌడ

రెబల్-స్టార్ అరవింద్ కేజ్రీవాల్

ఒకనాటి యునైటెడ్ ప్రంట్ కన్వీనర్ చంద్రబాబు

ప్రజాబలం కలిగిన జగన్ మోహనరెడ్డి

అన్నింటా దేశంలో ఫస్ట్ అని చెప్పుకొనే టీఆరెస్ అధినేత కేసీఆర్


వంటి మహా మహులంతా రాజీ పడిపోయారు. కొందరు తమ పార్టీ అస్తిత్వం మిగిలితే చాలన్నట్లుగా, కొందరైతే భయంతో నరేంద్ర మోడీ ఊసే ఎత్తడం లేదు. జాతీయంగా చక్రం తిప్పానని చెప్పుకునే చంద్ర బాబు కనీసం పొత్రం కూడా తిప్పలేక చతికిలబడి బీజేపీ కరుణ కోసం సాగిలపడ్డారు. అవినీతి చట్రంలో ఇరుక్కొని మాటి మాటికి ఢిల్లీ వెళ్లి సామంత రాజుల్లా ఎస్-బాస్ తరహా బతుకీడ్చే మరి కొందరు రాజకీయ జీవితంలో నరేంద్ర మోడీ ముందు సాగిల డ్డారు.


వీరి జీవితాలన్నీ అవినితి బురదలోనో ఊబిలోనో పడటం దీనికి ప్రధాన కారణం కేంద్ర దర్యాప్తు సంస్థల చాక చక్యం, దాదాపు నేతలంతా ఏవో లొసుగులతో సతమతమవుతూ భయం గుప్పిట్లో వణికి పోతుండటమే దీనికి మూలం


ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ స్వయంకృతం కొంత స్వీయపరాధం కొంత కలిపి తన పతనాన్ని తానే తెచ్చుకుంది. పరిపాలనలో, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చాలా బాగా పనిచేశారు. కానీ, రాజకీయం గ దేశాన్నినడపటంలో పార్టీ అధ్యక్షురాలైన సోనియాగాంధీ యువరాజావారు రాహుల్ గాంధీ పూర్తిగా విఫలమయ్యారు.  


స్వంత ప్రయోజనాల కోసం చిదంబరం - దిగ్విజయ్ సింగ్ - గులాం నబీ అజాద్ - వంటి వారు పార్టీని పూర్తిగా భ్రష్టు పట్టించారు. తమ ప్రయోజనాల కోణంలో పార్టీని పక్కదారి పట్టించారు. చిదంబరం తన అధికారంతో చేసిన కుంభకోణాలు ఇప్పు డిప్పుడే బయటపడుతున్నాయి.


యువతరం పార్టీలో బలపడకుండా వృద్ధనాయకత్వం దిగ్విజయ్, కమలనాథ్, ఆజాద్ లాంటి వాళ్ళు అడుగడుగునా అడ్డుకుంటూ వచ్చారు. కాంగ్రెస్‌ ఇప్పటికీ కేంద్ర స్థానంలో ఉన్నా, ఆసరా ఇచ్చేందుకు మాత్రం ఇతర పార్టీలు కలిసి రావడం లేదు.


ఈ స్థితిలో ప్రస్తుతం జరుగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు విపక్షాలు మానసిక స్తైర్యాన్నినింపు కునేందుకు దోహదం చేయవచ్చుననే భావన వ్యక్తమవుతోంది.


“మోడీ కరిష్మాలు - షా వ్యూహాలు” పనిచేయక పోతే ప్రజాతీర్పులో సామాన్యుని కష్టాలే ప్రతిబింబిస్తే కచ్చితంగా మార్పునకు పునాది పడుతుందంటున్నారు. ప్రతిపక్షాలన్నిటినీ ఒకే తాటిపై నడపాలంటే దీటైన నాయకత్వం కావాలి.


ఇందుకు కాంగ్రెస్‌ పార్టీ కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. వారసత్వం పట్ల తనకు ఏమాత్రం నమ్మకం లేదంటున్న రాహుల్ గాంధీ ఇతరుల నాయకత్వంలో పని చేసేందుకూ సిద్ధం కావాలి. కాంగ్రెస్‌ దేశంలో బీజేపీ తర్వాత పెద్ద పార్టీ.


ఈ స్థితిలోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ నాయకత్వంపై మరోసారి చర్చ మొదలైంది. పశ్చిమ బెంగాల్‌లో విజయమో? వీరస్వర్గమో? అన్న రీతిలోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ తెగించి పోరాడుతున్నారు. స్వతహాగా అహంభావి అహంకారి అయిన ఆమె మోడీ – షా వ్యూలను, కేంద్ర దర్యాప్తు సంస్థలు, సంఘ్ పరివార్ శక్తులు అన్నింటిని ఒంటి చేత్తో ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు తప్ప, తమ మధ్య ఐఖ్యత సాధించటానికి ఆమె ముందుకు రాలేక పోతున్నారు. గతంలో నారా చంద్రబాబు నాయుడు నమ్మించి మోసం చేసారు.


ఒక వేళా ఈ ఒంటరి పోరాటంలో మమత విజయం సాధించి పశ్చిమ బెంగాల్ లో మరోసారి అధికారం దక్కించు కుంటే భారత చరిత్రలో కీలక రాజకీయ పరిణామానికి, కీలక మలుపుకు తెరదీసినట్లవుతుంది  చెల్లాచెదురై ఉన్న విపక్షాలు ఆమె నాయకత్వంలో మళ్లీ ఒక గొడుగు కిందకు చేరేందుకు ఆసరా దొరుకుతుంది


దేశంలో బీజేపీ వ్యతిరేక శక్తులకు పశ్చిమ బెంగాల్ ఆశ్రయంగా మారవచ్చు నంటున్నారు. ఒకవేళ అనూహ్యంగామమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ బీజేపీ చేతిలో పరాజయం చవిచూస్తే 2024పై కూడా విపక్షాలు ఆశలు వదులు కోవటమే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: