నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న రోజులు మారుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు నాణ్యమైన రుచికరమైన ఆహారం అందించేందుకు డైట్ చార్జీలను పెంచాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. రోగులకు మంచి మెను తయారు చేసి మంచి ఆహారాన్ని అందించాలని నిర్ణయించింది. ఆరోగ్య శ్రీ పేషెంట్ల తరహాలోనే రోజుకు 100 రూపాయలకు  పెంచాలని నిర్ణయించారు.


నిశితంగా పరిశీలన చేసి మంచి మెనూ ఇవ్వాలని నిర్ణయించారు. జూనియర్‌ డాక్టర్ల స్టై ఫండ్‌ పెంపుపైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. వైఎస్ ఆర్ ఆరోగ్య శ్రీ లోకి కొత్త చికిత్సల చేరికలపై ఆలోచన చేశారు. వైయస్సార్‌ ఆరోగ్య శ్రీ జాబితాలోకి కొత్త చికిత్సలు చేరిక దాదాపు ఖరారు చేశారు. కొన్ని సంప్రదింపులు మిగిలి ఉన్న దృష్ట్యా కార్యక్రమం ప్రారంభానికి  సమయం కావాల్సి వచ్చింది. అక్టోబరు 5కు బదులు, అక్టోబరు 15 న ఆరోగ్య శ్రీ జాబితాలోకి మరిన్ని చికిత్సల చేరిక కార్యక్రమం చేపట్టనున్నారు.


ఆరోగ్య శ్రీ జాబితాలో లో కొత్త చికిత్సల చేరికను అక్టోబరు 15 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. అదే రోజు  ఫ్యామిలీ డాక్టర్‌ పైలెట్‌ ప్రాజెక్టు ప్రారంభించాలని నిర్ణయించారు. డిసెంబర్ నాటికి  మరో 432 కొత్త 104–వాహనాలు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆస్పత్రుల్లో ఖాళీ పోస్టులను ఎప్పటి కప్పుడు భర్తీ చేసేందుకు మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు  చేయాలని నిర్ణయించారు. మరింత రుచికరమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేషెంట్‌ డైట్‌ ఛార్జీలను పెంచనున్నారు. ఇప్పుడు వైయస్సార్‌ ఆరోగ్యశ్రీలో 2 వేల 446 చికిత్సలు ఉండగా.. కొత్త వాటి చేరికతో 3వేల254 కు  చికిత్సల సంఖ్య చేరనున్నాయి.


ఆరోగ్య శ్రీ, అనుబంధ సేవల కింద చేస్తున్న ఖర్చు గత ప్రభుత్వంతో పోలిస్తే ఏడాదికి దాదాపు మూడు రెట్లు పెరిగింది. పెరిగిన ప్రొసీజర్లతో ఏడాదికి ఆరోగ్య శ్రీకి సుమారుగా 2వేల500 కోట్లు, ఆరోగ్య ఆసరాకోసం సుమారు 300 కోట్లు,108,104లకోసం సుమారు మరో 400 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మొత్తంగా దాదాపు 3వేల 200 కోట్లు వరకూ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, 108, 104 ల కోసం ఖర్చు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: