క‌రోనా వైర‌స్ వ్యాప్తి మూలాలు అంత‌మొందించ‌లేం అన్న విష‌యం చైనాలో న‌మోద‌వుతున్న కొత్త కేసుల‌ను బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. ఏతావాతా చెప్పొచ్చేదేమంటే...వ్యాక్సిన్ వ‌చ్చేంత వ‌ర‌కు కూడా క‌రోనాకు విరుగుడు లేద‌ని తేలిపోయింది.వైర‌స్ వ్యాప్తి ఏదో ఒక రూపంలో కొన‌సాగుతూనే ఉంటుంది. మాన‌వ‌,జంతు శ‌రీరాల‌ను స్థావ‌రాలుగా చేసుకుంటున్న దిక్కుమాలిన‌, ద‌రిద్ర‌పు గొట్టు వైర‌స్ త‌న ఉనికిని, సామార్థ్యాన్ని పెంచుకుంటు పోతోంది. ఈనేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అదేమంటే క‌రోనా వైర‌స్ ఉధృతి త‌గ్గ‌ముఖం ప‌ట్టినా కొన్నాళ్ల‌పాటు ఓ క‌న్నేసి ఉంచ‌డం అన్న‌ది ఎంతో అవ‌స‌రమ‌ని భావిస్తోంది. 

 

అందుకోసమే ప్ర‌త్యేకంగా క‌రోనా టెస్టుల‌ను నిర్విరామంగా కొన‌సాగించేందుకు ప్ర‌ణాళిక‌ను ర‌చించింది. ఇప్ప‌టికే  కరోనా వ్యాప్తి గురించి తెలుసుకునేందుకు ప్రతి జిల్లాలో వారానికి కనీసం 200 మందికి టెస్టులు చేయించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ఆదేశించింది. ప్రస్తుతం జ‌రుగుతున్న టెస్టులతో నిమిత్తం లేకుండా  ఈ ప‌రీక్ష‌ల‌ను కొన‌సాగించాల‌ని పేర్కొంది. ఇప్ప‌టికే అన్ని రాష్ట్రాల‌కు కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసంజిల్లాకో ఆరు ప్రభుత్వ, నాలుగు ప్రైవేటు హాస్పిటల్స్‌‌ను ఎంపిక చేయాల‌ని  సూచించింది. 


ఇదిలా ఉండ‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు 2వేల‌కు పైగా కేసులు న‌మోదు కాగా తెలంగాణ‌లో 1300వంద‌ల‌కుపైగా కేసులు న‌మోద‌య్యాయి.  అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా ప‌రీక్ష‌లు వేగంగా జ‌రుగుతుండ‌గా తెలంగాణ‌లో మాత్రం ల‌క్ష‌ణాలు క‌నిపించిన వారికి మాత్రమే నిర్వ‌హిస్తుండ‌టంపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతు న్నాయి. అయితే గ‌డిచిన మూడు రోజులుగా 50కి పైగా కేసులు న‌మోద‌వుతూ వ‌స్తున్నాయి.  తెలంగాణలో మాత్రం భారీ ఎత్తున కోవిడ్ టెస్టులు జరగడం లేదు. ఈ విషయం కేంద్రం దృష్టికి కూడా వెళ్లింది. మ‌రి కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి మ‌రి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: