ప్రస్తుత మన జీవితంలో జంక్ ఫుడ్ కి అలవాటు పడ్డాము. జంక్ ఫుడ్  ఎక్కువగా తీసుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్ కి అలవాటు పడిపోవడం, శరీరానికి తగిన వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి వంటివన్నీ ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి. అయితే వీటన్నింటిలోనూ ప్రధానంగా ఇబ్బంది పెట్టే సమస్య గుండె పోటు. కొందరికి ఈ సమస్య వారసత్వంగా కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి, మీకు గుండె పోటు జబ్బు వచ్చే అవకాశం ఉంటే కొన్ని జాగ్రత్తలు పాటించి గుండె పోటు సమస్య తగ్గించుకోవచ్చు.


గుండె పోటు సమస్య రాకుండా ఉండాలంటే ముందుగా మద్య పానం,ధూమ పానం మానుకోవాలి.ఒకవేళ మీకు ధూమపానం, మద్యపానం వంటివి అలవాటు ఉంటే మీకు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ధూమపానం వల్ల మీకు మాత్రమే కాదు.. మీ చుట్టూ ఉన్నవారికి కూడా ముప్పు ఉంటుంది కాబట్టి దాన్ని పూర్తిగా మానేయడం మంచిది. వీలైనంత వరకూ ఈ రెండు అలవాట్లను తగ్గించుకోవడం, పూర్తిగా మానేసేందుకు ప్రయత్నించడం వల్ల గుండె జబ్బు ముప్పు కూడా తగ్గుతుంది.


చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల రోజంతా పని చేస్తూ సీట్ కే పరిమితమైపోతుంటారు. ఇలా చేయడం వల్ల గుండె జబ్బు వచ్చే ముప్పు పెరుగుతుందట. అందుకే ప్రతి గంటకి ఓసారి సీట్ నుంచి లేచి ఓ ఐదు నిమిషాల పాటు నడవాల్సి ఉంటుంది. అలాగే రోజూ ఓ అరగంట పాటు వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. ప్రతి మనిషి వారానికి కనీసం 150 నిమిషాల పాటు సాధారణ స్థాయి, 70 నిమిషాల పాటు హై ఇంటెన్సిటీ వర్కవుట్ చేయాలని వైద్యులు వెల్లడిస్తారు.


ఇక భోజనంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.ఎక్కువగా కూరగాయలు, పండ్లు, ముడి ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నట్స్, ప్రొటీన్ ఎక్కువగా దొరికే పదార్థాలు, చేపలు వంటివి తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. వీటితో పాటు పీచుపదార్థం ఎక్కువగా తీసుకోవాలి. రిఫైన్డ్, ప్రాసెస్డ్ ఆహారాన్ని వీలైనంతగా తగ్గించడం కూల్ డ్రింక్స్ మానేయడం వంటివి చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: