మొక్కజొన్నలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అని నిపుణులు చెబుతున్నారు. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దల దాక మొక్కజొన్నలతో చేసిన ఆహారాన్ని ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే మొక్కజొన్నలతో చేసిన వంటకాలు కూడా తినడానికి ఎంతో రుచికరంగా ఉంటాయి. ఇప్పుడు మొక్కజొన్న కెర్నల్స్ చాలా చోట్ల విరివిగా లభిస్తున్నాయి కూడా. మొక్కజొన్న కెర్నల్స్‌లో ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు,విటమిన్లు ఎ, బి, ఇ వంటి ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి.వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలు దూరం అవుతాయి.మరి స్వీట్ కార్న్ తినడం వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందామా. !


మొక్కజొన్నలలో ఫైబర్ అధికంగా కలిగి ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది గ్యాస్, ఆమ్లత్వం, మలబద్ధకం సమస్యను తగ్గించి జీర్ణవ్యవస్థను మెరుగుగా ఉంచుతుంది.శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.అలాగే మొక్కజొన్న కెర్నల్స్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అవి కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి.అందుకనే మీ రోజువారీ ఆహారంలో మొక్కజొన్నలు తినడం వల్ల దృష్టి సామర్ధ్యం పెరుగుతుంది.షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళు వీటిని తింటే డయాబెటిస్ సమస్యను అధిగమించవచ్చు. అలాగే క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మొక్కజొన్న తినాలి. కెర్నల్స్‌లో ఫినోలిక్ ఫ్లేవనాయిడ్లు యాంటి ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి.  ఇవి క్యాన్సర్ నివారణకు ఉపయోగపడతాయి.ఇందులో అదనంగా ఫ్యూరిక్ ఆమ్లం ఉంటుంది.


మొక్కజొన్న కెర్నల్స్‌లో స్టార్చ్, ఫైబర్ ఉంటాయి.ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.మొక్కజొన్నలో మెగ్నీషియం, ఆర్సెనిక్ పుష్కలంగా ఉంటాయి.ఇది మీ ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.మొక్కజొన్నలో జింక్, భాస్వరం కూడా ఉన్నాయి.ఇది ఎముక సంబంధిత వ్యాధులను తొలగించడంలో సహాయపడుతుంది. మొక్కజొన్నలలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.వీటిలో ఐరన్విటమిన్ ఎ, థియామిన్,విటమిన్ బి 6, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి.ఈ కరోనా కష్ట కాలంలో వీలయినంత వరకు మీ ఆహారంలో మొక్కజొన్న చేర్చుకోండి. రోగ నిరోధక శక్తిని పెంచుకోండి.. !






మరింత సమాచారం తెలుసుకోండి: