పుస్తకం కంటే గొప్ప స్నేహితుడు దొరకబోరని పెద్దలు చెపుతుంటారు. కొన్ని పుస్తకాలు చదివినప్పుడు అలాగే అనిపిస్తుంది. ఆ పుస్తకాలు గొప్పవాళ్ళ జీవిత చరిత్రలైతే ఇంకా అద్భుతమైన మిత్రుడు దొరికినట్టే. అందుకే పాతకాలంలో ఏ ఇంటికి వెళ్లినా పుస్తకాలు కనిపిస్తాయి. అప్పట్లో ఏ కాస్త ఖాళీ సమయం దొరికినా ఒక పుస్తకం తీసి చదవడం అనే మంచి అలవాటు ఉండేది. ఈ అలవాటే వారిని గొప్పగా తీర్చిదిద్దుతుంది. ఇప్పుడు సాంకేతిక విప్లవం వలన పుస్తకాలు కనిపించడం తక్కువ అయిపోయింది. ఎక్కడో ఇంకా పుస్తకాలు వదలలేని వారు వాటిని సేకరించి వాళ్ళలాంటి అలవాటు ఉన్న వారికోసం అందుబాటులో ఉంచుతున్నారు.

అన్ని మతగ్రంధాల సారం శాంతి అని అందరికీ తెలుసు. కానీ ఆ శాంతిని సాధించుకోవడానికి మాత్రం కృషి ఉండదు. కేవలం తాత్కాలిక ప్రయోజనాల కోసమే పరుగులు పెడుతున్న నేటి  కాలంలో పుస్తకాలు చదివి విలువలు అలవర్చుకోవడం చాలా అరుదు. నేర్చుకోవాలి అనుకుంటే ఎన్నో విలువలు ఆయా ధార్మిక గ్రంధాలలోనే ఉన్నాయి. కానీ అవి చదివే ఆసక్తి ఉన్నవారు లేరు. అసలైతే అవి చదివి వాటి సారాన్ని చెప్తున్నవారి మాటలు వినడం కూడా సాధ్యం కానీ వాళ్ళు అనేకం ఉన్నారు. చెప్పిందే వినలేకపోతుంటే, ఇక పుస్తకాలను చదివి నేర్చుకోవడం సాధ్యం కానీ పని. చిన్నతనం నుండే చేతికి ఐపాడ్ లు ఇస్తున్నప్పుడు ఇక పుస్తకాలు ఎవరు పట్టుకుంటారు, ఎలా ఒక మంచి మిత్రుడి విలువ తెలుసుకుంటారు. నేడు మిత్రుడు అంటే అవసరానికి వాడుకునే వస్తువు అయిపోయింది. అందుకే గొప్ప పుస్తకాలతోనే గొప్ప వ్యక్తిత్వం అలవడుతుందని పెద్దలు ఊరికే చెప్పలేదు.

తాజాగా సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేద్యుడి జీవితం గురించి రాసిన పుస్తకం చదివి గొప్ప అనుభూతిని పొందారు. ఆ విషయాన్ని ఆయన స్వయంగా ఒక కార్యక్రమంలో పంచుకున్నారు. నోరి చేసిన సేవలు ప్రశంసనీయం. ముఖ్యంగా ఆయన తెలుగు వారికి చేసిన సేవలు అభినందనీయం అన్నారు రమణ. ఒదిగిన కాలం పేరిట ఆయన జీవితాన్ని పుస్తకరూపంలో అందుబాటులోకి తేవడం ఎందరికో స్ఫూర్తినిస్తుందని ఆయన అన్నారు. ఆయన జీవితం మానవసేవే మాధవసేవ అనే నానుడికి నిలువెత్తు నిదర్శనం అని రమణ కొనియాడారు. ఆ పుస్తకం చదువుతున్నంత సేపు కళ్ళలో నీళ్లు  తిరిగాయని రమణ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: