నేడు కేవలం గాంధీ జయంతి మాత్రమే కాదు అంతర్జాతీయ అహింసా దినోత్సవం కూడా. ఎప్పుడూ సత్యం, అహింస అంటూ ప్రతిధ్వనించే మన మహాత్మ గాంధీజీ ఎంతో ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించే వారు.చక్కటి ఆరోగ్యకరమైన జీవన విధానంపై 'కీ టు హెల్త్‌ బై ఎంకే గాంధీ' అనే పుస్తకంలో ఆనాడే చాలా చక్కగా వివరించారు మహాత్మ గాంధీజీ. మంచి జీవనశైలి, ఫిట్‌నెస్‌గా ఉండటం ఇవే ఆరోకరమైన జీవితానికి ప్రధానమైనవని ఆయన బలంగా నమ్మేవారు. ఇక నేడు ఆయన జయంతి సందర్భంగా గాంధీజీ ఆరోగ్య సూత్రాలు, ఆయన జీవన విధానం గురించి తెలుసుకుందాం.గాంధీజీ నడక, తాజా కూరగాయాలు, పండ్లు తీసుకోవడం చేసేవారు. ఇక పొగాకు, ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం తోపాటు పర్యావరణ పరిశుభ్రత తదితరాలే ఆరోగ్య జీవనానికి వెనుముక అని మహాత్ముడు విశ్వసించేవారు. చాలామంది ఆరోగ్య నిపుణులు గాంధీ ఆరోగ్య సూత్రలనే గట్టిగా నమ్మేవారు. ఆ రోజల్లో ప్రబలంగా ఉండే టీబీ, కుష్టువ్యాధి, కలరా ఇంకా మలేరియా వంటి వ్యాధుల నిర్మూలనకు పరిసరాల పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ గురించి గాంధీజీ నొక్కి చెప్పేవారు. ఆయన మరణాంతం దాకా మంచి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపటం తోపాటు ధ్యానం, ఫిట్‌ నెస్‌ని ఎప్పుడూ విస్మరించలేదని గాంధీ గారి సన్నిహితులు చెబుతుండేవారు.గాంధీజీ  అనేక రకాల అనారోగ్య సమస్యలతో భాధపడ్డారు. 1925 నుంచి 1944 దాకా మూడుసార్లు మలేరియా బారినపడ్డారు.


అలాగే 1919, 1924లో అపెండిసెటిస్‌, ఫైల్స్‌ కోసం ఆపరేషన్‌లు చేయించుకున్నారు. ఇంకా ఆయన కొంతకాలం ఊపిరితిత్తుల సమస్యతో కూడా బాధపడ్డారు.అయితే ఈ అనారోగ్య సమస్యలే ఆయన్ను ఆరోగ్యకరమైన జీవన విధానంపై దృష్టిపెట్టేలా చేశాయి. ఈ నేపథ్యంలో ఆయన పోషకమైన ఆహారం, శారీరక ఆరోగ్యం, మంచి నిద్ర అలవాట్లు ఇంకా సమతుల్య ఆహారం తదితరాలపై దృష్టి పెట్టడమే గాక దాని గురించి పుస్తకం రాసి మరీ తన అభిప్రాయాలను పంచుకున్నారు.గాంధీజీ ఎప్పుడూ కూడా పొలం లేదా స్థానికంగా పండించే పండ్లు, కూరగాయాలే తినేవారు.ఎక్కువ నూనె, ఉప్పు వాడకానికి చాలా దూరంగా ఉండేవారు.పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్నవాటిని అస్సలు దరిదాపుల్లోకి రానిచ్చేవారు కాదు.అలాగే ఆయన పాలిష్ చేసిన బియ్యం, శుద్ధి చేసిన గోధుమ పిండికి పూర్తి వ్యతిరేకి.గాంధీ గారు ఆరోజుల్లోనే తృణధాన్యాల గొప్పతనం, ఫైబర్‌ కంటెంట్‌ గురించి  చెప్పడం విశేషం.ఇక వయస్సుకు తగ్గ విధంగా సమతుల్య ఆహారం తీసుకోవడం, అలాగే తీపి పదార్థాలకు దూరంగా ఉండటం.మరీ అంతగా తీపి తినాలనుకుంటే కొద్దిగా బెల్లం ముక్కను తీసుకోవడంఇంకా తప్పనిసరిగా నడక రోజువారి దినచర్యలో భాగంగా ఉండటం వంటి అలవాట్లు ఖచ్చితంగా మనం మహాత్మ గాంధీ నుంచి మనం నేర్చుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: