ఛాయ్ బిస్కెట్ తో షార్ట్ ఫిలింస్ చేస్తూ సత్తా చాటిన సందీప్ రాజ్ డైరక్షన్ లో వచ్చిన మొదటి సినిమా కలర్ ఫోటో. సుహాస్, చాందిని చౌదరి లీడ్ రోల్ లో వచ్చిన ఈ సినిమా ఆహా ఓటిటిలో రిలీజైంది. సినిమా చూసిన ఆడియెన్స్ అంతా కూడా సూపర్ అనేశారు. కలర్ ఫోటో సినిమాకు సెలబ్రిటీస్ నుండి కూడా ప్రశంసలు దక్కాయి.

సినిమాలో సునీల్ విలన్ గా నటించడం విసేషం. కమెడియన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకుని ఆ తర్వాత హీరోగా కొన్ని సినిమాలు తీసిన సునీల్ కలర్ ఫోటోతో విలన్ గా మారాడు. ఈమధ్యనే సినిమాల్లో హీరో ఫ్రెండ్ రోల్స్ చేస్తూ సుహాస్ కూడా అలరిస్తున్నాడు. ఫైనల్ గా కలర్ ఫోటో ఆహాలో 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ పొందినట్టు తెలుస్తుంది. ఈ సినిమా హిట్ అని చెప్పేందుకు ఇంతకన్నా వేరే ఎక్సాంపుల్ చెప్పాల్సిన పనిలేదు.

కరోనా లాక్ డౌన్ టైం లో థియేటర్లు మూతపడ్డాక ఓటిటిలో రిలీజై హిట్ అయిన సినిమాల్లో కలర్ ఫోటో ఒకటి. ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. సినిమాకు కాళభైరవ మ్యూజిక్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. మొదటి సినిమాతోనే సుహాస్ మంచి హిట్ అందుకున్నాడు. తెలుగు అమ్మాయి చాందిని చౌదరి కూడా ఈ సినిమాతోనే కెరియర్ లో మొదటి హిట్ కొట్టింది. అయితే ఈ సినిమా హిట్ కొట్టినా సరే సుహాస్ రెగ్యులర్ గా కామెడీ రోల్స్ చేస్తూ సెలెక్టెడ్ స్టోరీస్ వచ్చినప్పుడు మాత్రమే హీరోగా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.                                                      

మరింత సమాచారం తెలుసుకోండి: