తెలుగు చిత్ర పరిశ్రమలో నటి రోహిణి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో రోహిణి స్క్రిప్ట్‌రైటర్‌గా, రచయితగా, అసిస్టెంట్‌ డైరెక్టర్, డైరెక్టర్‌గా, కథానాయకిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా ఇలా వెండితెరకు చెందిన విభిన్న అంశాల్లో రాణిస్తూ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఆమె ఇండస్ట్రీకి బాల నటిగా పరిచయమైయ్యారు. రోహిణి తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం భాషలలో అనేక సినిమాలలో బాల నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక రోహిణి వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆమె విశాఖ పట్టణం అనకాపల్లిలో జన్మించారు. ఆమెకు ముగ్గురు అన్నలు, ఒక తమ్ముడు. ఉన్నారు. ఆమెకి నాలుగేళ్ళ వయసులో తల్లి సరస్వతి చనిపోవడంతో చెన్నైకి మకాం మార్చారు. ఇక సినిమాల మీద ఆసక్తితో తండ్రి స్టూడియోల చుట్టూ తిరుగుతుంటే రోహిణిని కూడా తీసుకెళ్ళేవాడు. అలా స్టూడియోలా చుట్టూ తిరుగుతున్న సమయంలో ఆమెను చూసి యశోద కృష్ణ అనే సినిమాలో బాలనటిగా అవకాశం వచ్చింది. ఆమె బాల నటిగా పలు భాషలోనూ నటించారు.

ఆ తరువాత రోహిణి మలయాళ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైయ్యారు. ఇక అక్కడే ఆమె రఘువరన్ ని తొలిసారిగా చూశారు. ఇక ఆ సినిమా విజయవంతం కావడంతో మలయాళంలో వరుసగా అవకాశాలు అందుకుంది. రోహిణీ తెలుగు, తమిళ చిత్రాల్లో కూడా పనిచేసింది. అంతేకాదు.. నటన, డబ్బింగ్ లో కొనసాగుతూనే ప్రైవేటుగా ఆంగ్లంలో ఎం.ఎ పూర్తి చేసింది రోహిణి.

అప్పట్లో ఇండస్ట్రీలో విలన్ గా రాణించిన ప్రముఖ నటుడు రఘువరన్ ని రోహిణి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక వీరి వివాహబంధము పొసగక వివాహమైన ఏడు సంవత్సరాలకు 2003లో విడాకులు తీసుకున్నారు. రోహిణి పెళ్లి తరువత ఇండస్ట్రీకి దూరమైయ్యారు. ఆ తరువాత కమల్ హాసన్ సినిమాతో రి ఎంట్రీ ఇచ్చింది. రోహిణి తమిళంలో ‘అప్పావిన్‌మీసై’ చిత్రానికి దర్శకత్వం వహించింది. ప్రస్తుత రోహిణి క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలో రాణిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: