కె రాఘవేంద్రరావు హీరోయిన్ల ను చూపించినంత అందంగా మరే దర్శకుడు చూపించ లేదంటే అతియోశక్తి కాదు. హీరోయిన్లను ఎలా చూపించాలో రాఘవేంద్రరావుకు మాత్రమే తెలుసు... అని ఎంతోమంది బాలీవుడ్ దర్శక , నిర్మాతలు సైతం ఆయన ప్రశంసించారు. 1990వ దశకంలో రమ్య - రోజా  - రంభ - నగ్మా ఇలా ఎంతో మంది క్రేజీ హీరోయిన్లను మరెంతో అందంగా వెండితెరపై చూపించి తెలుగు ప్రేక్షకులకు వీనులవిందు చేశారు. ఇదిలా ఉంటే నగ్మా కు కె.రాఘవేంద్రరావు ఎలా ? ఛాన్స్ ఇచ్చారో తెలిస్తే కాస్త ఆశ్చర్యం అనిపిస్తుంది. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు శరత్ దర్శకత్వంలో పెద్దింటి అల్లుడు సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమాలో న‌గ్మా హీరోయిన్‌..!

 ఆ సినిమా షూటింగ్ స్పాట్ కు వెళ్ళిన రాఘవేంద్రుడు న‌గ్మాను చూశారట. వెంటనే రాఘవేంద్రుడు కళ్ళన్నీ నగ్మా మీద పడి పోయాయ‌ట‌. పదేపదే ఆమెను తన మనసులోనే జూమ్ చేసి చూశారట. ఈ అమ్మాయి తో కచ్చితంగా తాను ఓ సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయారు. నగ్మా కళ్ళు తనను అంతలా ఆకర్షించాయి అని ఆయన చెప్పారు. ఆ తర్వాత న‌గ్మాను కావాలని మరి చిరంజీవి తో తెరకెక్కించిన ఘ‌రానా మొగుడు సినిమాలో తొలిసారిగా ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

ఘరానా మొగుడు సినిమాలో చిరంజీవి - నగ్మా పోటీపడి నటించారు. ఈ సినిమా తర్వాత మొత్తం మరో మూడు సినిమాలకు రాఘవేంద్రుడు నగ్మా ను హీరోయిన్ గా పెట్టుకున్నారు. దివంగత ఎన్టీఆర్ కెరీర్లో చివరి బ్లాక్ బస్టర్ హిట్ అయిన మేజర్ చంద్రకాంత్ సినిమాలో కూడా నగ్మా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మోహ‌న్ బాబుకు పెళ్లాంగా.. అల్ల‌రి చిల్ల‌రి పెళ్లాంగా న‌గ్మా న‌ట‌న ఆక‌ట్టుకుంది. ఇక న‌గ్మా - త‌మిళ్ హీరో సూర్య భార్య జ్యోతిక - మెగాస్టార్ మాస్ట‌ర్ హీరోయిన్ రోషిణి అక్కాచెళ్లెళ్లు కావ‌డం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: